Site icon HashtagU Telugu

DC vs CSK: పంత్ ఒంటి చేత్తో భారీ సిక్స్, అభిమానులు స్టాండింగ్ ఒవేషన్

DC vs CSK

DC vs CSK

DC vs CSK: విశాఖపట్నం వేదికాగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన కీలక పోరులో ఢిల్లీని విజయం వరించింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ 13వ మ్యాచ్‌లో పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి టోర్నమెంట్‌లో తొలి విజయం నమోదు చేసింది. చాలా కాలం తర్వాత మైదానంలోకి అడుగుకు పెట్టిన పంత్ చెన్నై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. దీనికి తోడు డేవిడ్ వార్నర్ (52), పృథ్వీ షా (43) రాణించడంతో విశాఖపట్నంలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగుల భారీ టార్గెట్ చెన్నై ముందుంచింది.

We’re now on WhatsAppClick to Join.

192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైను ఢిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్ల వేట కొనసాగించారు. ఢిల్లీ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో చెన్నై 171/6 స్కోరుకే పరిమితం అయింది. ఢిల్లీ తొలి విజయాన్ని రుచి చూడగా, వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీలో తొలి ఓటమిని చవిచూసింది. కాగా ఈ మ్యాచ్ ద్వారా రిషబ్ పంత్ అభిమానుల్ని ఫుల్ ఖుషీ చేశాడు. భారీ ఇన్నింగ్స్ ఆడిన పంత్ 160 స్ట్రైక్ రేట్‌తో ఫిఫ్టీ సాధించాడు. ఇక ఈ మ్యాచ్ లో పంత్ ఒంటి చేత్తో భారీ సిక్స్ బాదాడు. ఇది చూసిన అభిమానులు లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ విజయంతో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ మార్పులు చేసింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు 9వ స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. అదే సమయంలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క స్థానం కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది.

Also Read: KTR: సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలిచేది గులాబీ పార్టీనే

Exit mobile version