Pant Test hundreds: రిషబ్ పంత్ ప్రపంచ వ్యాప్తంగా యువతకు ఆదర్శంగా నిలిచాడు. చెన్నై టెస్టు ద్వారా 638 రోజుల తర్వాత టెస్టు క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన అతను అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. పంత్ 2022 డిసెంబర్ లో చివరి టెస్టు ఆడాడు. ఆ తర్వాత డిసెంబరు 30న పంత్‌కు ఘోర ప్రమాదం జరిగింది. దాని కారణంగా అతను చాలా కాలం క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు. ఇప్పుడు టెస్టుల్లో చిరస్మరణీయ పునరాగమనం చేశాడు.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చెన్నై టెస్టు మ్యాచ్‌లో టీమిండియా విజయం దాదాపు ఖాయమైంది. బంగ్లాదేశ్‌కు భారత్ 515 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (Rishabh Pant), శుభ్‌మన్ గిల్ సెంచరీలతో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. సెంచరీ చేయడంతో పంత్ భారత మాజీ లెజెండరీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఎంఎస్ ధోనీని సమం చేశాడు. 638 రోజుల తర్వాత టెస్టు క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన రిషబ్ పంత్ చెన్నై టెస్టులో 128 బంతుల్లో 109 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 13 ఫోర్లు మరియు 4 సిక్సర్లు కూడా కొట్టాడు. పంత్ ఇన్నింగ్స్ నిజంగా అద్భుతంగా ఉంది. అతని పునరాగమనాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. పంత్ 58 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు చేసి ఘనత సాధించాడు. దీంతో ధోనీ (MS Dhoni)ని సమం చేశాడు. ఎంఎస్ ధోనీ 144 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు చేయగా, పంత్ 58 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు సాధించాడు. అయితే ధోని రికార్డును అధిగమించాలంటే పంత్ మరో సెంచరీ సాధిస్తే సరిపోతుంది. పంత్ ఆడటానికి ఇంకా చాలా సంవత్సరాల సమయం ఉంది.
Also Read: Laddu Issue : తప్పు చేసిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తాం: చంద్రబాబు