టీమిండియా వికెట్ కీపర్… ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్…రిషబ్ పంత్..ఆయనకు ఖరీదైన వాచీలంటే చాలా ఇష్టం. ఫ్రాంక్ ముల్లర్ వాన్ గార్డ్ యాచ్ కింగ్ సిరీస్ కు వాచీని కొనుగోలు చేసేందుకు ఏకంగా రూ. 36లక్షలు చెల్లించాడు. విలాసవంతమైన వాచీలు తక్కువ ధరకే లభిస్తాయని నమ్మబలకడంతో ఆశ పడ్డాడు. కానీ ఈ విలాసవంతమైన వాచీల ఆశతో ఫంత్ రూ. 1.63కోట్లు కోల్పోయాడు.
రిషబ్ మోసపోయింది…సైబర్ మోసగాళ్ల చేతిలో కాదు…ఓ లోకల్ క్రికెట్ చేతిలో. హర్యానాకు చెందిన మృణాక్ సింగ్…ఖరీదైన వాచీలను, మొబైల్ ఫోన్లను ఎక్కువ ధరకు అమ్మి…తక్కువ ధరకు బ్రాండెడ్ వాచీలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. అతగాడి మాటలు నమ్మని పంత్ అతనికి రూ. 1.63కోట్ల విలువైన సొత్తును అప్పజెప్పాడు. మృణాక్ సింగ్ బోగస్ చెక్ తో పంత్ ను మోసం చేశాడు. తాను మోసపోయానని గ్రహించిన పంత్ …అతని మేనేజర పునీత్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వెల్లడించింన వివరాలు ప్రకారం…జనవరి 2021లో మృణాక్ సింగ్, రిషభ్ పంత్ తో పాటు అతని మేనేజర్ పునితీ సోలంకిని కలిశాడు. తాను ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశానని ఖరీదైన లగ్జరీ వాచీలు, బ్యాగులు, జ్యువెల్లరినీ కొనుగులు చేసి వాటికి విక్రయిస్తానని వారిని నమ్మించాడు. చాలామంది క్రికెటర్లకు ఇలా వాచీలు అమ్మినట్లు కూడా రిఫరెన్సులు చూపించాడు. మృణాక్ సింగ్ మాటలు నమ్మిన రిషబ్, సోలంకి…అతనికి ఓ ఖరీదైన వాచీ, కొన్ని నగలు బంగారు నగలను అప్పగించారు. ఫిబ్రవరిలో వాటిని రిషబ్ నుంచి రీసెల్ కోసం కొనుగోలు చేసినట్లుగా రూ.1.63 కోట్లకు మృణాక్ సింగ్ చెక్కు ఇచ్చాడు. అది బౌన్స్ కావడంతో మృణాక్ సింగ్ పై రిషబ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖరీదైన వాచీలు ఇష్టపడే…పంత్ కు ఈ పిచ్చే అతని కొంప ముంచింది.