Site icon HashtagU Telugu

Viral Video: సపోర్ట్ లేకుండా బ్యాట్ పట్టిన పంత్

Viral Video

New Web Story Copy (11)

Viral Video: టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. గతేడాది పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ పంత్ ముంబైలోని కోకిల బెన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం పంత్ ఎన్సీయేలో పునరావాసం పొందుతున్నాడు. ఎప్పటికప్పుడు తన ఫిట్‌నెస్ గురించి సమాచారం ఇస్తూనే ఉన్నాడు. అయితే ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ మొదటిసారి ప్రసంగించాడు. రిషబ్ పంత్ ప్రసంగానికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఒక వీడియోలో పంత్ క్రికెట్ ఆడేందుకు సన్నద్ధం అయినట్టు కనిపించాడు. మైదానాన్ని ముద్దాడి ఎలాంటి సపోర్టు లేకుండా సొంతంగా క్రీజులోకి వెళ్ళాడు. బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. కానీ పంత్ పూర్తి ఫిట్నెస్ గా లేడని అర్ధం అవుతుంది. పంత్‌లో ఉత్సాహం నింపేందుకు ప్రేక్షకులు ఈలలు, కేకలతో హోరెత్తించారు. రెండో వీడియోలో మాత్రం పంత్ అద్భుతంగా ప్రసంగించాడు. ఆగస్టు 15 సందర్భంగా NCAలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వీడియోలో, అతను జీవితంలోని క్షణాలను ఆస్వాదించమని సలహా ఇచ్చాడు.

Also Read: Ananya Pandey : చీర కట్టులో మెరిసిపోతున్న లైగర్ భామ