DC vs GT: రెచ్చిపోయిన పంత్, అక్షర్.. ఢిల్లీ చేతిలో ఓడిన గుజరాత్

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 40వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 224 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అయితే 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.

DC vs GT: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 40వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 224 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అయితే 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.

దిల్లీ బ్యాటర్లలో పంత్‌తో పాటు అక్షర్‌ పటేల్‌ రెచ్చిపోయి ఆడారు. అక్షర్ పటిల్ 43 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సల సాయంతో 66 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్ పటేల్ తన ఐపీఎల్ కెరీర్‌లో రెండో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. పంత్‌తో కలిసి అక్షర్ పటేల్ నాలుగో వికెట్‌కు 68 బంతుల్లో 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే నూర్ అహ్మద్ అక్షర్ పటేల్‌ను అవుట్ చేశాడు. స్టబ్స్‌ 26 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక రిషబ్ పంత్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.ఆరంభంలో వరుస వికెట్లు కోల్పోయిన ఢిల్లీని పంత్ ఆదుకున్నాడు. గుజరాత్ బౌలర్లపై విధ్వంసం సృష్టించి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ అక్షర్ పటేల్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో పంత్ 4 సిక్స్‌లు, ఒక ఫోరుతో 31 పరుగులు చేశాడు. పంత్ ఈ మ్యాచ్ లో కేవలం 43 బంతుల్లో​ 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 88 పరుగులు పిండుకున్నాడు. గుజరాత్‌ బౌలర్లలో సందీప్‌ వారియర్‌ 3 వికెట్లు తీయగా నూర్‌ ఆహ్మద్‌ ఒక్క వికెట్‌ తీశాడు.

We’re now on WhatsApp : Click to Join

225 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. సాయి సుదర్శన్​ 39 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్​ల సాయంతో 65 పరుగులతో మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా.. డేవిడ్ మిల్లర్ 23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్​ల సాయంతో 55 పరుగులతో విధ్వంసం సృష్టించాడు, వృద్ధిమాన్ సాహా 25 బంతుల్లో 1 సిక్స్​​, 5 ఫోర్ల సాయంతో 39, షారుక్ ఖాన్(8), రాహుల్ తెవాతియా(4), రషీద్ ఖాన్​(21), రవి శ్రీనివాస్​ సాయి కిశోర్​(13) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో రాసిఖ్​ దర్ సలామ్​ 3, కుల్దీప్ యాదవ్ 2, అన్రిచ్ నోర్జే, ముకేశ్ కుమార్​, అక్సర్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా 100వ ఐపీఎల్ మ్యాచ్ ఆడిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి నిరాశపరిచాడు. గిల్ 5 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ సహాయంతో 6 పరుగులతో పెవిలియన్ చేరాడు.

Also Read: DC vs GT: రెచ్చిపోయిన పంత్, అక్షర్.. జెల్లీ చేతిలో ఓడిన గుజరాత్