Site icon HashtagU Telugu

Rishab: రిషబ్ పంత్ ని కాపాడిన బస్ డ్రైవర్ చెప్పిన విషయాలు వింటే షాక్ అవ్వాల్సిందే?

pant accident

Pant Car Accident Sixteen Nine 0 780x470

Rishab: తాజాగా టీమిండియా క్రికెటర్ రిషభ్‌ పంత్ రోడ్ యాక్సిడెంట్లో గాయపడిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం తెల్లవారుజామున సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. అయితే ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. కారు ప్రమాదంలో రిషబ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం జరిగిన చోట అలాగే ఆ ప్రమాదాన్ని చూసిన మొదటి వ్యక్తి బస్సు డ్రైవర్ సుశీల్ మన్. అతడే దేశపు పొందు ప్రాణాలను కాపాడాడు. ఆ ప్రమాదం గురించి స్పందించిన సుశీల్ అసలు ప్రమాదం ఎలా జరిగింది? ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు?అతను ఏం చేశాడు అన్న విషయాల గురించి తాజాగా స్పందించాడు.

ఈ సందర్బంగా సుశీల్ మాట్లాడుతూ.. నేను హరిద్వార్ వైపు నుంచి వస్తుండగా ఢిల్లీ వైపు నుంచి వేగంగా వస్తున్న ఒక కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అది చూసిన వెంటనే బస్సు ఆపాను. ఆ కారు బారికేడ్‌ను ఢీకొట్టి 200 మీటర్లు దూసుకెళ్లింది. కారులో ఎవరున్నది తెలిసేలోపే అందులో మంటలు చెలరేగాయి. అప్పుడు ఆ కారులో నుంచి ఒక వ్యక్తి బయటికి రావడానికి ప్రయత్నిస్తుండగా అది చూసి నేను అక్కడికి వెళ్లాను. అతన్ని బయటికి లాగాను. అప్పుడు అతను నా పేరు రిషబ్‌ పంత్‌, నేను టీమిండియా క్రికెటర్‌ని మా అమ్మకు ఫోన్‌ చేయండి అని నాతో చెప్పాడు.

అయితే నేను క్రికెట్ పెద్దగా చూడను కాబట్టి అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఇంతలో బస్సు నుంచి కొంతమంది అక్కడికి వచ్చి ఇతడు క్రికెటర్ పంత్ అనే చెప్పారు. ఆ కారులో ఇంకా ఎవరైనా ఉన్నారా అని తొంగి చూడగా అక్కడ ఒక బ్లూ కలర్ బ్యాగు కనిపించగా అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఎనిమిది వేల రూపాయలు క్యాష్ ఉంది వెంటనే అతన్ని అంబులెన్స్ ఎక్కించి ఆ తర్వాత ఆ బ్యాగ్ ను అతనికి అందజేశాను. అప్పుడు అతన్ని డెహ్రాడూన్‌ ఆసుపత్రికి తరలించారు అని చెప్పుకొచ్చాడు సుశీల్.