Rishab Pant Auction: మెగా వేలానికి ముందు రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసింది. దీంతో పంత్ (Rishab Pant Auction) 2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి ప్రవేశించాడు. పంత్ కోసం మొదట లక్నో సూపర్ జెయింట్స్ వేలం వేసింది. ఆర్సీబీ కూడా పంత్ కోసం పోటీ పడింది. ఇరుజట్ల మధ్య 11.25 కోట్ల వరకు పోటీ కొనసాగింది. అప్పుడు 12 కోట్లు అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చింది.దీంతో హైదరాబాద్ మరియు లక్నో మధ్య భీకర పోటీ కనిపించింది. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ RTM ద్వారా 20.755 కోట్లకు పంత్ ను కొనుగోలు చేయాలని భావించింది. అయితే లక్నో 27 కోట్ల బిడ్ వేసింది. దీంతో మిగతా జట్లన్నీ సైలెంట్ అయిపోయాయి. ఈ విధంగా ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు కొనుగోలు చేసిన శ్రేయాస్ అయ్యర్‌ను అధిగమించాడు. అయితే పంత్ అంత మొత్తాన్ని అందుకుంటాడా అంటే అది సాధ్యపడదు.
Also Read: Delhi Assembly Elections :’ఆప్’తో పొత్తు లేదు.. ఒంటరిగా బరిలోకి : కాంగ్రెస్
27 కోట్లలో పంత్ కు దక్కేది కేవలం 18 కోట్లు మాత్రమే. వాస్తవానికి భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను స్లాబ్‌ల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రతి సంవత్సరం 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జీతం ఉంటే దానిలో 30% పన్నుగా చెల్లించాలి. అందువల్ల పంత్ కు ఫ్రాంచైజీ ఇచ్చే 27 కోట్లలో 30% అతని ఖాతా నుండి తీసివేయబడుతుంది. ఫలితంగా రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్‌తో తన మూడేళ్ల పదవీకాలంలో ప్రతి సీజన్‌కు 18.9 కోట్ల వేతనం మాత్రమే పొందనున్నాడు. కాంట్రాక్ట్ విలువ 27 కోట్లు అయితే 8.1 కోట్లు పన్ను రూపంలో పోతుంది. దీంతో పంత్ చేతికి 18.9 కోట్లు మాత్రమే అందుతాయి. ఐపీఎల్ లో పంత్ రికార్డులు అద్భుతంగ ఉన్నాయి. రిషబ్ పంత్ 111 మ్యాచ్‌లలో 148.93 స్ట్రైక్ రేట్‌తో 3284 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ మరియు 18 అర్ధ సెంచరీలు చేశాడు. ఐపీఎల్‌లో పంత్ 75 క్యాచ్‌లు, 23 స్టంపింగ్‌లు చేశాడు.