KKR Finally Wins: కీలక మ్యాచ్ లో కోల్ కత్తా గెలుపు

మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ కు శుభారంభం దక్కలేదు. పడిక్కల్ , బట్లర్ త్వరగానే ఔటయ్యరు.

  • Written By:
  • Publish Date - May 2, 2022 / 11:55 PM IST

మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ కు శుభారంభం దక్కలేదు. పడిక్కల్ , బట్లర్ త్వరగానే ఔటయ్యరు. అయితే సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నాడు.
సంజూ శాంసన్ 49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 54 హాఫ్ సెంచరీతో రాణించాడు. సంజూ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కు రియాన్ పరాగ్ 12 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 19, హెట్‌మైర్ 13 బంతుల్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో 27 నాటౌట్ మెరుపులు తోడవ్వడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. శివం మావి, సునీల్ నరైర్, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

153 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన కోల్ కత్తా నాలుగో ఓవ‌ర్‌లోనే ఆరోన్ ఫించ్ వికెట్ కోల్పోయింది. కాసేపటికే ఇంద్రజిత్ కూడా ఔటవడంతో కోల్ కత్తా కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చాలా మ్యాచ్ ల తర్వాత బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 34 రన్స్ తో అయ్యర్ ప‌ర్వాలేద‌నిపించ‌గా… నితీశ్ రాణా 48 నాటౌట్‌ రింకూ సింగ్ 42 నాటౌట్‌ తో కేకేఆర్‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చారు. మ‌రో ఐదు బంతులు మిగిలి ఉండ‌గానే ల‌క్ష్యాన్ని చేరుకుని 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో ప్ర‌సిద్ధ్‌, బౌల్ట్‌, కుల్దీప్ సేన్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. ఈ విజయంతో కోల్ కత్తా తమ ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది.