Site icon HashtagU Telugu

Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్‌.. మొత్తం సీజన్ ఆడేందుకు రిషబ్ పంత్ సిద్ధం..!

Rishabh Pant

Rishabh Pant

Rishabh Pant: IPL 2024కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్‌ వచ్చింది. ఐపీఎల్ సీజన్ మొత్తం ఆడేందుకు రిషబ్ పంత్ (Rishabh Pant) సిద్ధంగా ఉన్నాడని రికీ పాంటింగ్ చెప్పాడు. ఐపీఎల్ మొత్తం ఆడతానన్న నమ్మకంతో రిష‌బ్ పంత్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. డిసెంబర్ 30, 2022న జరిగిన ఘోరమైన కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఆ తర్వాత అతను క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు పంత్ IPL 2024 కోసం తిరిగి మైదానంలో అడుగుపెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే తిరిగి వచ్చిన తర్వాత పంత్ వికెట్ కీపింగ్ చేస్తాడా లేదా కెప్టెన్సీ చేస్తాడా అనేది పాంటింగ్ స్పష్టం చేయలేదు.

క్రిక్‌బ‌జ్‌లోని ఓ నివేదిక ప్ర‌కారం. పాంటింగ్ పంత్ గురించి ఇలా అన్నాడు. రిషబ్ IPL ఆడటానికి బాగానే ఉంటాడని నమ్మకంగా ఉన్నాడు. కానీ అతను ఆడే సామర్థ్యం గురించి మాకు ఖచ్చితంగా తెలియదు. మీరు సోషల్ మీడియాలో అన్ని విషయాలు చూశారు. అతను బాగానే పరుగెత్తుతున్నాడని చూశాను. కానీ మేము మొదటి మ్యాచ్‌కి కేవలం 6 వారాల దూరంలో ఉన్నాము. కాబట్టి అతను వికెట్లు కీపింగ్ చేస్తాడా లేదా అనేది మాకు ఖచ్చితంగా తెలియదని పాంటింగ్ చెప్పాడు.

Also Read: Video of Swimket: నీటిలో క్రికెట్ మ్యాచ్.. అంతర్జాతీయ క్రికెట్ని తలదన్నే ఐడియా

ఇంకా మాట్లాడుతూ.. ఐపీఎల్ 2024కి రిషబ్ పంత్ సిద్ధంగా ఉన్నాడని ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు. తాను జట్టుకు ఆడతానని పంత్ స్వయంగా చెప్పాడని పాంటింగ్ చెప్పాడు. పంత్ వికెట్ కీపింగ్, కెప్టెన్సీని ధృవీకరించలేదని, అయితే అతను ఖచ్చితంగా బ్యాటింగ్ చేస్తాడని కోచ్ చెప్పాడు. రికీ పాంటింగ్ ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో ఉన్నారు. అతను అమెరికా మేజర్ లీగ్ (MLC)లో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించబడ్డాడు. మీడియాతో జరిగిన ఈ సంభాషణలో ఐపీఎల్, పంత్ పై ప్రశ్నలు సంధించారు. పంత్ మొత్తం టోర్నీ ఆడాలని అనుకోవడం సరికాదని, అయితే అతను ఎంత ఆడినా అది జట్టుకు బోనస్ అని పాంటింగ్ అన్నాడు. ఒకవేళ పంత్ కెప్టెన్సీ చేయలేకపోతే డేవిడ్ వార్నర్ జట్టుకు బాధ్యత వహిస్తాడని పాంటింగ్ ధృవీకరించాడు. వార్నర్ గత సీజన్‌లో ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో కేవలం 5 విజయాలతో 9వ స్థానంలో నిలిచింది.

We’re now on WhatsApp : Click to Join

రిషబ్ పంత్ తన చివరి క్రికెట్ మ్యాచ్ 2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో మిర్పూర్ మైదానంలో ఆడాడు. ఇది టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ జరిగిన ఐదు రోజుల తర్వాత డిసెంబర్ 30న పంత్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పటి నుండి అతను కోలుకుంటున్నాడు. మార్చి 2024 నాటికి పూర్తిగా ఫిట్‌గా ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ 2022 నుంచి రిషబ్ పంత్ క్రికెట్ ఆడలేదు. డిసెంబర్ 30, 2022న ఢిల్లీ నుండి రూర్కీకి వెళుతుండగా పంత్ కారు ప్రమాదానికి గురైంది. అందులో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీని తరువాత పంత్ చికిత్స వ‌ల‌న‌ మైదానానికి దూరంగా ఉన్నాడు.