RICE Therapy: క్రికెటర్లకు ‘రైస్‌ థెరపీ’

క్రికెట్లో గాయాలు సర్వసాధారణం. కానీ ఒక ఆటగాడు ఇంజ్యుర్ అయితే ఆ ప్రభావం జట్టుపై తీవ్రంగా పడుతుంది. ఆ ప్రభావం మ్యాచ్ గెలుపోటములను కూడా డిసైడ్ చేస్తుంది.ప్రపంచ కప్ కు ముందు టీమిండియా పరిస్థితి ఇదే.

RICE Therapy: క్రికెట్లో గాయాలు సర్వసాధారణం. కానీ ఒక ఆటగాడు ఇంజ్యుర్ అయితే ఆ ప్రభావం జట్టుపై తీవ్రంగా పడుతుంది. ఆ ప్రభావం మ్యాచ్ గెలుపోటములను కూడా డిసైడ్ చేస్తుంది.ప్రపంచ కప్ కు ముందు టీమిండియా పరిస్థితి ఇదే. అయ్యర్, రాహుల్, పాండ్య గాయాలతో టీమిండియా వీక్ గా కనిపంచింది. కానీ అనూహ్యంగా ఒక్కొక్కరు కోలుకుని జట్టుని పటిష్టంగా మార్చారు. తాజాగా పాండ్య గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో లెగ్ స్లిప్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సాధారణంగా మైదానంలో ఏ ఆటగాడైనా గాయపడితే ఫిజియో గ్రౌండ్‌లోకి వచ్చి ట్రీట్‌మెంట్ అందిస్తారు. గాయం తీవ్రతను బట్టి ప్లేయర్ మైదానంలో ఉండాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. మ్యాచ్‌లో గాయపడిన క్రీడాకారులకు రైస్ థెరపీని అందజేస్తారు. RICE అంటే రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్. గాయం తగిలిన ఆటగాళ్లకు 48-72 గంటల పాటు రెస్ట్‌ ఇస్తారు. ఐస్ తో మసాజ్ చేసి కట్టు కడతారు. ఆ తర్వాత ఎలివేషన్ థెరపీ అందిస్తారు. అంటే ఛాతి కంటే పైభాగంలో గాయం అయిన భాగాన్ని ఉంచుతారు.

Also Read: world cup 2023: ప్రపంచ కప్ చరిత్రలో అతి పెద్ద విజయం