David Warner: వార్నర్ దెబ్బ అదుర్స్ కదూ…

కెప్టెన్సీ నుంచి తొలగించి...తుది జట్టులో కూడా తప్పించి తనని ఘోరంగా అవమానించిన సన్ రైజర్స్ హైదరాబాద్ పై స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ రివెంజ్ తీర్చుకున్నాడు.

  • Written By:
  • Updated On - May 8, 2022 / 07:17 PM IST

కెప్టెన్సీ నుంచి తొలగించి…తుది జట్టులో కూడా తప్పించి తనని ఘోరంగా అవమానించిన సన్ రైజర్స్ హైదరాబాద్ పై స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ రివెంజ్ తీర్చుకున్నాడు. పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయినా.. ఏ మాత్రం ఒత్తిడికి లోనుకానీ వార్నర్ తన అసలు సిసలు ఆటను చూపించాడు. వార్నర్ సూపర్ ఇన్నింగ్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన క్రికెటర్ రివేంజ్‌ను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
గత సీజన్ వరకు సన్‌రైజర్స్‌కు ఆడిన వార్నర్‌ను మెగావేలానికి ముందు ఆ జట్టు వదిలేసింది. గత సీజన్ సెకండాఫ్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా జట్టుకు దూరం చేసింది. ఫ్రాంచైజీ తీరుతో బాధపడిన వార్నర్ ప్రేక్షకుడిలా మైదానంలో మ్యాచ్‌లను తిలకించాడు. మనీశ్ పాండే విషయంలో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌తో తలెత్తిన వివాదం అతన్ని జట్టు నుంచి బయటకు పంపేలా చేసింది. కొన్ని మ్యాచ్ లకు జట్టుతో పాటు స్టేడియంలోకి కూడా రాలేదు. హోటల్ లో కూర్చునే మ్యాచ్ లు వీక్షించాడు.
మెగా వేలంలో వార్నర్ ను ఢిల్లీ క్యాపిటల్ జట్టు తీసుకుంది. వేలంలోకి 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో వ‌చ్చిన వార్న‌ర్‌ను 6 కోట్ల 25 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు ఢిల్లీ ఫ్రాంచైజీ దక్కించుకుంది. నిజానికి  ఐపీఎల్‌లో డేవిడ్ వార్న‌ర్ త‌న కెరీర్ ను  ఢిల్లీఫ్రాంచైజీ త‌ర‌ఫునే ఆరంభించాడు. ఐపీఎల్ 2009 సీజన్ నుంచి 2013 వ‌ర‌కు ఢిల్లీ జట్టు తరఫునే  వార్న‌ర్ బరిలోకి దిగాడు. ఆ తరువాత 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వచ్చిన వార్నర్.. సీజన్ ముగింపులో సారథిగా నియమితుడయ్యాడు.
ఇదిలా ఉంటే సన్ రైజర్స్ తో మ్యాచ్ లో సెంచరీ చేసే అవకాశం ఉన్నా వార్నర్ పట్టించుకోలేదు. చివరి ఓవర్‌లో స్ట్రైకింగ్ తీసుకోకుండా ధాటిగా ఆడాలని పొవెల్‌కు సూచించాడు. దాంతో వార్నర్‌ను అభిమానులు కొనియాడుతున్నారు.వ్యక్తిగత ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వకుండా జట్టు కోసం ఆడిన వార్నర్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.