Site icon HashtagU Telugu

Hardik Pandya : ముందు రిటైర్ , తర్వాత ట్రేడింగ్… ముంబై గూటికి హార్దిక్ పాండ్యా

Retiring First, Trading Later... Hardik Pandya For Mumbai Indians

Retiring First, Trading Later... Hardik Pandya For Mumbai Indians

Hardik Pandya : ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియ ఆసక్తికరంగా ముగిసింది…ఊహించినట్టే గుజరాత్ కెప్టెన్ , స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ముంబై జట్టులోకి తిరిగి వచ్చాడు. అయితే పాండ్యా ముంబై జట్టులోకి వచ్చే క్రమంలో చాలా డ్రామా నడిచింది. రిటెన్షన్ ముగిసేటప్పటికి పాండ్యా తమతోనే ఉన్నాడనీ గుజరాత్ లిస్ట్ రిలీజ్ చేసింది. అయితే రెండు గంటల తర్వాత ముంబైకి ట్రేడ్ అయినట్టు తెలిసింది. గుజరాత్‌కు భారీ మొత్తం చెల్లించేందుకు ముంబయి సిద్ధమైందని.. బీసీసీఐ, ఐపీఎల్‌ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కానీ అది ఎంత మొత్తమో మాత్రం వెల్లడించలేదు. ఎంత ఇచ్చినా అందులో 50 శాతం హార్దిక్‌ (Hardik Pandya)కు దక్కుతుంది. మరోవైపు హార్దిక్‌ (Hardik Pandya)కు ముంబయి ఏడాదికి 15 కోట్లు చెల్లించనుంది. ముంబై జట్టులో మరో ఆసక్తికర మార్పు చోటు చేసుకుంది.

We’re Now on WhatsApp. Click to Join.

గతేడాది భారీ ధరకు కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అమ్మేసింది. పూర్తి క్యాష్‌కు అతన్ని ఆర్సీబీకి ట్రేడ్ చేసింది. ఈ ట్రేడ్‌తో సమకూరిన భారీ డబ్బుతో గుజరాత్ టైటాన్స్‌ నుంచి పూర్తి సొమ్ము చెల్లించి హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకుంది.పాండ్యా కోసం కొన్ని రోజులుగా ముంబై ఇండియన్స్ ప్రయత్నిస్తోంది. అతన్ని ఎలాగైనా తిరిగి జట్టులోకి తీసుకోవాలని, టీం ఫ్యూచర్ కెప్టెన్‌గా తయారు చేయాలని అనుకుంటూ వచ్చింది. నాటకీయ పరిణామాల మధ్య చివరికి అతన్ని దక్కించుకుంది. కాగా ముంబై నిర్ణయంపై మిశ్రమ స్పందన వచ్చింది. ముంబై ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ తమ పాండ్యా ముంబైకి ఆడుతున్నాడని సంతోషపడుతున్నారు. అదే సమయంలో గ్రీన్‌ను వదులు కోవడం అంత గొప్ప నిర్ణయం కాదని మరికొందరు అంటున్నారు.

Also Read:  Ind vs Aus T20: రుతురాజ్ కు సారీ చెప్పిన యశస్వి జైస్వాల్