Kohli vs Maxwell: కోహ్లీ vs మ్యాక్స్ వెల్

ఆర్సీబీ ఆటగాళ్లు గ్లెన్ మ్యాక్స్ వెల్, కింగ్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఈ స్టార్ బ్యాటర్స్ డిఫరెంట్ కంట్రీస్ కి ఆడుతున్నప్పటికీ ఐపీఎల్ లో మాత్రం ఇద్దరు ఒకే ఫ్రాంచైజీకి సారధ్యం వహిస్తున్నారు

Kohli vs Maxwell: అంతర్జాతీయంగా గ్లెన్ మ్యాక్స్ వెల్, కింగ్ కోహ్లీ డిఫరెంట్ కంట్రీస్ కి ఆడుతున్నప్పటికీ ఐపీఎల్ లో మాత్రం ఇద్దరు ఒకే ఫ్రాంచైజీకి సారధ్యం వహిస్తున్నారు. కానీ సొంత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ స్టార్ బ్యాటర్స్ జట్టు భారాన్ని భుజానేసుకుని వీరోచితంగా పోరాడుతారు. చివరి వరకు స్టాండ్ ఇచ్చి విజయాన్ని ఖాయం చేసుకునే పెవిలియన్ చేరుతారు. కోహ్లీకి పాకిస్థాన్ మీద ఇదే స్థాయిలో రికార్డు నమోదైతే మ్యాక్స్ వెల్ కి నిన్న జరిగిన ఆఫ్ఘానిస్తాన్ పై నమోదైంది. గత సంవత్సరం టి20 వరల్డ్ కప్ లో టీమిండియా పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 159 పరుగులు చేసింది. దీంతో 160 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభం నుంచి వరుస షాకులు తగిలాయి. జట్టు స్కోరు 7.3 ఓవర్లకు 35 మాత్రమే అప్పటికే నలుగురు బ్యాటర్లు పెవిలియన్​ చేరారు. ఆ సమయంలో విన్ ప్రెడిక్టర్ పాక్​ గెలిచే ఛాన్స్ 85 శాతం, భారత్​కు కేవలం 15 శాతం మాత్రమే ఉందని డిసైడ్ చేశాడు. కానీ ఆ రోజు కోహ్లీ వీరోచిత పోరాటం చేశాడు. తొలుత పాండ్యతో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కింగ్ పాండ్య అవుట్ అవ్వడంతో మళ్ళీ మ్యాచ్ కష్టాల్లోకి వెళ్ళింది. చివర్లో రవిచంద్ర అశ్విన్ తో కలిసి 82 రన్స్ చేసి టీమిండియాను గెలిపించాడు.

ఇక నిన్న ఆఫ్ఘన్ పై గ్లెన్ మ్యాక్స్ వెల్ ఆడిన విధానం చూసి గత వరల్డ్ కప్ లో కోహ్లీ పోరాటాన్ని గుర్తు చేస్తున్నారు. పాకిస్థాన్​పై కోహ్లీ విన్ ప్రెడిక్టర్​ను తారుమారు చేసినట్లుగానే.. ఆఫ్ఘాన్ పై గ్లెన్ మ్యాక్స్ వెల్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్ టాపార్డర్ దారుణంగా విఫలం చెందింది. మిడిల్ ఆర్డర్ సైతం చేతులెత్తేసింది. 97 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆసీస్ తీవ్ర కష్టాల్లోకి వెళ్ళింది. ఆ సమయంలో ప్రెడిక్టర్ ఆఫ్ఘానిస్తాన్ ​ గెలిచే ఛాన్స్ 89 శాతం, ఆస్ట్రేలియాకు కేవలం 11 శాతం మాత్రమే ఉందని డిసైడ్ చేశాడు. మ్యాచ్ చూస్తున్న అందరు కూడా ఆఫ్ఘన్ విజయం ఖాయమనుకున్నారు. కానీ మైదానంలో అడుగుపెట్టిన మ్యాక్సీ ప్రెడిక్టర్​ను తారుమారు చేశాడు. కండరాల నొప్పితో బాధపడుతూనే విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆఫ్ఘన్ బౌలర్లను ఊచకోత కోశాడు. 121 బంతుల్లో 21 బౌండరీలు, 10 సిక్సర్లతో 201 పరుగులు చేసి ఆసీస్ ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో విరాట్-మ్యాక్స్​వెల్ ఇద్దరూ సేమ్ టు సేమ్ అని ఫ్యాన్స్ అంటున్నారు. గత మ్యాచ్ లో ఆఫ్ఘన్ పై మ్యాక్స్​వెల్ ఫోర్లు, సిక్సులతో డీల్ చేస్తే.. పాకిస్థాన్ పై కోహ్లీ భారీ షాట్లు కొడుతూనే, సింగిల్స్, డబుల్స్​ తీస్తూ మ్యాచ్ ని విజయతీరాలకు చేర్చాడు.

Also Read: ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు