Records: రికార్డులతో హోరెత్తిన వాంఖడే స్టేడియం.. తొలి సెమీస్ లో నమోదైన రికార్డులు ఇవే..!

ఈ మ్యాచ్‌లో రికార్డుల మోత మోగింది. రోహిత్‌శర్మ సిక్సర్లతో ఆరంభమై... కోహ్లీ రికార్డ్ సెంచరీ.. షమీ అద్భుతమైన బౌలింగ్‌తో రికార్డుల (Records) పరంపర కొనసాగింది.

  • Written By:
  • Updated On - November 16, 2023 / 10:18 AM IST

Records: ఊహించినట్టుగానే వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ రసవత్తరంగా సాగింది. ఫుల్‌ ఫామ్‌లో ఉన్న టీమిండియాకు, ఫైటర్స్‌గా పేరున్న న్యూజిలాండ్‌ చివరి వరకూ గట్టిపోటీనే ఇచ్చింది. చివరికి భారత్ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో రికార్డుల మోత మోగింది. రోహిత్‌శర్మ సిక్సర్లతో ఆరంభమై… కోహ్లీ రికార్డ్ సెంచరీ.. షమీ అద్భుతమైన బౌలింగ్‌తో రికార్డుల (Records) పరంపర కొనసాగింది. కెప్టెన్ రోహిత్‌శర్మ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. 48 ఏళ్ళ ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 2015, 2019, 2023 వరల్డ్‌కప్‌లు ఆడిన హిట్‌మ్యాన్‌ 51 సిక్సర్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. కివీస్‌తో మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్లతో గేల్ పేరిట ఉన్న రికార్డును దాటేశాడు. ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇదిలా ఉంటే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. వన్డేల్లో 50 శతకాలు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. తద్వారా సచిన్ పేరిట ఉన్న రికార్డును తిరగరాసిన విరాట్‌ ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. 2003 ప్రపంచకప్‌లో సచిన్ పేరిట ఉన్న 673 పరుగుల రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు.

Also Read: World Cup Final: ఛాంపియన్‌గా అవతరించేందుకు ఒక్క అడుగు దూరంలో టీమిండియా..!

మరోవైపు కోహ్లీతో పాటే సెమీస్‌లో శతకం సాధించిన శ్రేయాస్ అయ్యర్ కూడా అరుదైన మైలురాయి అందుకున్నాడు. వరల్డ్‌కప్ నాకౌట్‌ మ్యాచ్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. శ్రైయాస్ 70 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇక భారత పేసర్ మహ్మద్ షమీ 7 వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు. ఈ వరల్డ్‌కప్‌లో 5 వికెట్లు సాధించడం షమీకి ఇది మూడోసారి. అలాగే వరల్డ్‌కప్‌ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గానూ ఘనత సాధించాడు. ఆడిన 6 మ్యాచ్‌లలోనే 23 వికెట్లు పడగొట్టి ఈ వరల్డ్‌కప్ హయ్యెస్ట్‌ వికెట్ టేకర్‌గా నిలిచాడు.

We’re now on WhatsApp. Click to Join.