Kohli and RCB: కోహ్లీ ఆర్సీబిని వీడకపోవడానికి కారణమేంటో తెలుసా ?

ఐపీఎల్ లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు 2013 సీజన్‌ నుంచి సారథిగా వ్యవహరించిన విరాట్‌ కోహ్లి.. ఒక్క ట్రోఫీ కూడా అందించకుండానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

  • Written By:
  • Publish Date - May 6, 2022 / 09:53 AM IST

ఐపీఎల్ లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు 2013 సీజన్‌ నుంచి సారథిగా వ్యవహరించిన విరాట్‌ కోహ్లి.. ఒక్క ట్రోఫీ కూడా అందించకుండానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్‌-2021 సీజన్ ముగిసైనా తర్వాత కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలోనే ఈ సీజన్ ముంగిట ఆర్సీబీ యాజమాన్యం దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ను సారథిగా ఎంపిక చేసింది . ఇక ఐపీఎల్‌ కెరీర్‌ ఆరంభం నుంచి 15 సీజన్ల పాటు ఆర్సీబీకి మాత్రమే ప్రాతినిధ్యం వహించి, ఐపీఎల్‌ చరిత్రలో ఏ ఆటగాడికి దక్కని ఘనతను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ.. తనకు ఇతర ఫ్రాంఛైజీల నుంచి చాలాసార్లు ఆఫర్లు వచ్చాయని తాజాగా చెప్పుకొచ్చాడు.

నిజాయితీగాచెప్పాలంటే నా పేరును వేలంలో నమోదు చేసుకోవాలని చాలా ఫ్రాంచైజీలు అడిగాయి. నేను కూడా వేలంలోకి వెళ్తే బావుంటుందని అనుకున్నాను. దాని గురించి ఓసారిబాగా ఆలోచించాను.. కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే ఆర్సీబీ నన్ను చాలా నమ్మింది. ముఖ్యంగా కెరీర్ ఆరంభంలో వరుసగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించింది. అది ఎప్పటికీ మర్చిపోలేను. ఏదేమైనా బెంగళూరు జట్టుపై ఉన్న ప్రేమే తనని వేరే జట్లలోకి వెళ్లకుండా చేసిందని అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అలాగే ఐపీఎల్​లో ట్రోఫీ గెలవలేదనే అంశాన్ని తాను పెద్దగా పట్టించుకోనని కోహ్లీ పేర్కొన్నాడు. ఇక 2008 నుంచి 2012 దాకా ఆర్సీబీలో సాధారణ ఆటగాడిలా కొనసాగిన కోహ్లి.. 2013 నుంచి 2021 సీజన్‌ వరకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ సీజన్‌ తర్వాత కెప్టెన్సీని వదులుకున్న కోహ్లిని.. ఆర్సీబీ 15వ సీజన్ కోసం 15 కోట్లకు డ్రాఫ్ట్‌ చేసుకుంది. ఇక ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. చెన్నైపై విజయం సాధించిన ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.