Site icon HashtagU Telugu

Yashasvi Jaiswal: జైస్వాల్ క్యాచ్‌లను వదిలేయడానికి కారణమిదేనా.. వీడియో వైర‌ల్‌!

Yashasvi Jaiswal: ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ యశస్వీ జైస్వాల్ (101), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (147), రిషభ్ పంత్ (134) లు మొదటి ఇన్నింగ్స్‌లో శతకాలు సాధించారు. అదేవిధంగా రెండవ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (137), రిషభ్ పంత్ (118) శతకాలు బాదారు. అయినప్పటికీ భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఇంగ్లాండ్ 371 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా సాధించింది.

భారత ఓటమికి ప్రధాన కారణం ఫీల్డర్లు కొన్ని సులభమైన అవకాశాలలో క్యాచ్‌లను వదిలేయడం. ముఖ్యంగా యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) ఫీల్డింగ్ ప్రశ్నార్థకంగా మారింది. అతను మొద‌టి మ్యాచ్‌లో 4 క్యాచ్‌లను వదిలేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ ఒలీ పోప్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్‌ల క్యాచ్‌లను వదిలేశాడు. ఇందులో పోప్, బ్రూక్ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడారు. దీనివల్ల భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో పెద్ద ఆధిక్యాన్ని సాధించలేకపోయింది. ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ బెన్ డకెట్‌ను 97 పరుగుల వద్ద క్యాచ్ వదిలేశాడు. ఆ తర్వాత డకెట్ 149 పరుగులతో మ్యాచ్‌ను గెలిపించే శతకం సాధించాడు.

Also Read: Viral : పిచ్చికి పరాకాష్ట.. మూత్రంతో కళ్లు కడుక్కున్న మహిళ.. ‘ఇదే అసలైన ప్రకృతి వైద్యం’ అంటూ ప్రచారం

జైస్వాల్ క్యాచ్‌లను వదిలేయడానికి కారణం చెప్పిన కైఫ్‌

భారత మాజీ బ్యాట్స్‌మన్ మహ్మద్ కైఫ్ తన X ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో జైస్వాల్ వదిలిన క్యాచ్‌ల గురించి విశ్లేషణ చేశాడు. “యశస్వీ జైస్వాల్ ఎందుకు క్యాచ్‌లను వదిలేస్తున్నాడు? మనం డ్యూక్స్ బంతితో ప్రాక్టీస్ చేస్తాం. గాయం అయినప్పుడు ఆటగాళ్ళు చేతికి పట్టీ కట్టుకుంటారు. దీనివల్ల వేళ్లు ఇరుక్కుపోతాయి. పట్టీ స్పంజిలా మారడం వల్ల బంతిని పట్టుకోలేరు. బంతి జారిపోతుంది. ఇదే జైస్వాల్ క్యాచ్ ప‌ట్టే స‌మ‌యంలో జ‌రిగింది” అని కైఫ్ వివ‌ర‌ణ ఇచ్చాడు.

అయితే మొదటి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ వదిలిన క్యాచ్‌లు ఖరీదైనవిగా మారాయి. ఎందుకంటే ఒలీ పోప్ 137 బంతుల్లో 106 పరుగులతో శతకం సాధించాడు. బ్రూక్ (99) శతకానికి ఒక్క పరుగు దూరంలో ఔటయ్యాడు. డకెట్ (62) అర్ధసెంచరీ సాధించాడు. రెండవ ఇన్నింగ్స్‌లో డకెట్ (149) మ్యాచ్‌ను గెలిపించే శతకం బాదాడు.