Site icon HashtagU Telugu

IND vs ENG 1st Test: నాలుగు తప్పులతో చేజారిన విజయం… భారత్ ఓటమికి కారణాలివే

Ind Vs Eng

Ind Vs Eng

IND vs ENG 1st Test: ఇంగ్లాండ్ తో అయిదు టెస్టుల సిరీస్ ను భారత్ ఓటమితో ప్రాంభించింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం సాధించి మరీ పరాజయం పాలయింది.

తొలి రెండు రోజులు పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్.. చివరి రెండు రోజుల్లో మాత్రం పేలవ బ్యాటింగ్, చెత్త ఫీల్డింగ్‌తో తేలిపోయింది. ముఖ్యంగా నాలుగు తప్పిదాలు టీమిండియా ఓటమిని శాసించాయి.
ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఫీల్డింగ్ మరీ దారుణంగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత ఫీల్డింగ్‌తో పాటు అసాధారణ క్యాచ్‌లు అందుకున్న మన ఫీల్డర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తేలిపోయారు. చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లు నేలపాలు చేయడంతో పాటు సునాయస బౌండరీలు ఆపలేకపోయారు. ముఖ్యంగా అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన ఓలిపోప్ రెండు క్యాచ్ లను వదిలేసి భారీ మూల్యం చెల్లించుకున్నారు

రెండో ఇన్నింగ్స్ లో పేలవ బ్యాటింగ్‌ భారత్ కొంపముంచింది. 231 పరుగుల స్వల్ప లక్ష్యచేధనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, జైస్వాల్ శుభారంభం అందించడంలో విఫలమవ్వగా.. శుభ్‌మన్ గిల్ డకౌట్ అయ్యాడు. అతని వైఫల్యం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. బ్యాక్ టు బ్యాక్ వికెట్లు కోల్పోవడంతో భారత బ్యాటర్లపై అనవసర ఒత్తిడి పెరిగింది. శ్రేయాస్ అయ్యర్ వైఫల్యం, జడేజా రనౌట్ కూడా దెబ్బతీశాయి.

అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు పంపిస్తూ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతను ఆచితూచి ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అతని లోయరార్డ్‌లోనే ఆడించి ఉంటే.. కేఎస్ భరత్, అశ్విన్‌లతో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పేవాడు. ఇదిలా ఉంటే తొలి ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు శతకాలు చేజార్చుకున్నారు. దూకుడుగా ఆడాలనే ఆలోచనతో పేలవ షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. టెస్ట్ తరహాలో బ్యాటింగ్ చేసి భారత్ మరింత ఆధిక్యాన్ని అందుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.

Also Read: CM Jagan: సీఎం జగన్ టార్గెట్ ఉత్తరాంధ్ర.. ఏలూరులో సిద్ధం 2