Virat Kohli : గుజరాత్ జోరుకు బెంగుళూరు బ్రేక్ వేస్తుందా ?

ఐపీఎల్‌-2022లో ఇవాళ మరో ఉత్కంఠ భరిత పోరుకు రంగం సిద్దమైంది. డివై పాటిల్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.

  • Written By:
  • Updated On - April 30, 2022 / 12:34 PM IST

ఐపీఎల్‌-2022లో ఇవాళ మరో ఉత్కంఠ భరిత పోరుకు రంగం సిద్దమైంది. డివై పాటిల్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు జ‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 7 విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్రస్థానంలో ఉండ‌గా, ఆర్సీబీ 9 మ్యాచ్‌ల్లో 5 విజ‌యాలు 4 ఓటముల‌తో 5వ‌ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచే జ‌ట్టు ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి…. రాజస్థాన్ రాయల్స్‌తో ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన త‌మ చివ‌రి మ్యాచ్‌లో ఆర్సీబీ 29 పరుగుల తేడాతో దారుణ ఓటమిపాలవగా, గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ తో తాను ఆడిన చివరి మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇక ఇరు జట్లు బలాబలాలు విషయానికి వస్తే.. బ్యాటింగ్‌ పరంగా ఇరు జట్లు పటిష్టంగా ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌ హార్దిక్ పాండ్య అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అదే విధంగా జట్టులో వృద్ధిమాన్ సాహా, శుబ్ మాన్ గిల్ ,రాహుల్ తేవాటియా , డేవిడ్ మిల్లర్ వంటి స్టార్‌ బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్‌ పరంగా కూడా గుజరాత్ టైటాన్స్ జట్టు బలంగా కన్పిస్తోంది. మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ , అల్జారీ జోసెఫ్, లాకి ఫెర్గ్యూసన్ వంటి అంతర్జాతీయ బౌలర్లు ఉన్నారు.

ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా బ్యాటింగ్‌ పరంగా దృఢంగా ఉన్నపటికీ ఆ జట్టు బ్యాటర్లు కీలక సమయంలో తేలిపోతున్నారు..
కెప్టెన్ డుప్లెసిస్, మాజీ సారథి విరాట్ కోహ్లీ, స్టార్ బ్యాటర్ గ్లేన్ మాక్స్ వెల్ ఫామ్ అందుకోవాల్సిన అవసరముంది. లోయరార్డర్ లో దినేష్ కార్తీక్ నిలకడగా మెరుపులు మెరిపించాల్సిన అవసరముంది. బౌలింగ్‌ జోష్ హేజిల్ ఉడ్ , మహ్మద్ సిరాజ్ ,వానిందు హాసరంగా అద్భుతంగా రాణిస్తున్నారు. వీరికి తోడు బ్యాటర్లు కూడా నిలకడగా రాణిస్తే ఆర్సీబీకి ఈ మ్యాచ్ లో తిరుగుండదని చెప్పొచ్చు. అయితే ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారకుండా ఉండాలంటే బెంగుళూరుకు ఈ మ్యాచ్ లో గెలుపు తప్పనిసరి.