ఐపీఎల్ 15వ సీజన్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ ఆయా ఫ్రాంచైజీల సన్నాహాలు జోరందుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే సూరత్‌లో ప్రాక్టీస్ మొదలుపెడితే.. మరికొన్ని జట్టు ఈ వారంతంలో నెట్స్‌లో అడుగుపెట్టనున్నాయి. ఇదిలా ఉంటే ప్రతీసారీ కొత్త సీజన్ కోసం కొన్ని ఫ్రాంచైజీలు అభిమానులకు ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తూ వారి అటెన్షన్‌ను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ విషయంలో కాస్త ముందుంటుంది. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా కప్ గెలవకపోయినా ఆర్‌సీబీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. జట్టులో పలువురు స్టార్ ప్లేయర్స్ ఉండడమే దీనికి కారణం. అయితే ఒక్కో సీజన్‌లో ఒక్కో కారణంతో విఫలమవుతూ ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేకపోయింది. దీంతో సీజన్ ముందు ప్రతీసారీ ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంటుంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి ట్రోల్స్‌ను ఎదుర్కొంటోంది. దీనికి కారణమేంటంటే మార్చి 12న ఓ సర్‌ప్రైజ్ ఉందటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆ సర్‌ప్రైజ్ ఏమై ఉంటుందా అని కొందరు ఆలోచిస్తుంటే… ఆ రోజు కొత్త కెప్టెన్‌ను , కొత్త జెర్సీని ప్రకటించనుందని తెలుస్తోంది. అయితే కొత్త లోగోను కూడా విడుదల చేయబోతున్నారా అనేది కూడా చర్చ జరుగుతోంది. ఆర్‌సీబీ మాత్రం లోగో గురించి ఎటువంటి ప్రకటన చేయకున్నా.. ఓవరాల్‌గా చర్చ నడస్తుండడంతో పాటు ట్రోలింగ్ కూడా నడుస్తోంది. ఈ బిల్టప్‌లు తర్వాత ముందు కప్ గెలవండి అని కొందరు…మీ ట్రోఫీ గ్యాలరీ చూస్తే ఖాళీనే తప్ప మరేం లేదంటూ కొందరు ట్రోల్స్, మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. అంతా బాగానే ఉంది ఈ సారైనా ట్రోఫీతో రండి అంటూ విజయ్‌మాల్యా చెబుతున్న మీమ్స్ కూడా వైరల్‌గా మారాయి.
When you unbox your trophy box😭 pic.twitter.com/3lR9xihN2r
— LØKÎ (@ImLokii45) March 7, 2022
https://twitter.com/MSDhoniwarriors/status/1500803902492770306
Here it is. #PlayBold 🔥 pic.twitter.com/2e14UxHOEO
— CSK Fans Army™ (@CSKFansArmy) March 7, 2022
https://twitter.com/Nooffence__7/status/1500806008200785922
కాగా గత సీజన్ తర్వాత విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ కెప్టెన్‌గా తప్పుకున్నాడు. దీంతో కొత్త సారథి రేసులో డుప్లెసిస్, మాక్స్‌వెల్‌తో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నా… సఫారీ క్రికెటర్ డుప్లిసిస్ వైపే ఆ ఫ్రాంచైజీ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఇటీవల ముగిసిన వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్‌ను తీసుకున్న బెంగళూరు తమ తొలి మ్యాచ్‌ను మార్చి 27న పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది.