RCB Vs Dhoni Team: చెన్నై,బెంగళూర్ లకు డూ ఆర్ డై

ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో భాగంగా మే 24న చేనై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. మహారాష్ట్రలోని ఎంసీఏ మైదానం వేదిక‌గా రాత్రి 7:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

  • Written By:
  • Publish Date - May 4, 2022 / 11:37 AM IST

ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో భాగంగా మే 24న చేనై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. మహారాష్ట్రలోని ఎంసీఏ మైదానం వేదిక‌గా రాత్రి 7:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్ర‌స్తుత సీజ‌న్‌లో ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డ‌టం ఇది రెండోసారి. తొలి ద‌శ‌లో ఏప్రిల్ 12న జ‌రిగిన హై స్కోరింగ్‌ మ్యాచ్‌లో ఆర్సీబీపై చెన్నై 23 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఆ మ్యాచ్‌లో రాబిన్ ఊతప్ప 88 పరుగులు , శివమ్ దూబే 95 పరుగులతో విజృంభించడంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 216 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఛేద‌న‌లో బెంగళూరు సైతం చివ‌రి వ‌ర‌కు పోరాడిన‌ప్ప‌టికీ ఫ‌లితం దక్కలేదు.

ఇక ఐపీఎల్ 15వ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్‌ల్లో ఇరు జ‌ట్ల జ‌యాప‌జయాల రికార్డుల‌ను ప‌రిశీలిస్తే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 10 మ్యాచ్‌ల్లో 5 విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో ఉండ‌గా, చెన్నై సూపర్ కింగ్స్ 9 మ్యాచ్‌ల్లో కేవ‌లం మూడే విజ‌యాల‌తో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే.. చిన్ని సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జ‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు త‌ల‌ప‌డిన 29 సంద‌ర్భాల్లో చెన్నై జట్టు 19, బెంగళూరు జట్టు 9 మ్యాచ్‌ల్లో విజ‌యాలు న‌మోదు చేశాయి. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.

ఇక ఈ మ్యాచ్ జరగనున్న ఎంసీఏ పిచ్ పై చివరి మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌ నమోదైంది. ఎంసీఏ స్టేడియం ఫాస్ట్ బౌలర్లకు అనుకులిస్తుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అలాగే ఈ మ్యాచ్ లో విజ‌యావ‌కాశాలు ఎవ‌రికి ఎక్కువగా ఉన్నాయనే విషయానికొస్తే.. ఇరు జ‌ట్ల తాజా ఫామ్‌ను బ‌ట్టి చూస్తే ఆర్సీబీతో పోలిస్తే చెన్నైకే విజ‌యావ‌కాశాలు అధికంగా ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ వరుస మ్యాచ్‌ల్లో ప్ర‌త్య‌ర్ధుల చేతుల్లో ఓడిన‌ప్ప‌టికీ బెంగళూరు కంటే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది.