Site icon HashtagU Telugu

IPL 2024: టీ ఇచ్చి మరీ ధోనీని ఆహ్వానించిన ఆర్సీబీ

IPL 2024

IPL 2024

IPL 2024: ప్లేఆఫ్‌కు అర్హత సాధించే నాల్గవ జట్టేడో ఈ రోజుతో తేలిపోనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రేపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం.అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఓ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

వీడియోలో ఎంఎస్ ధోని ఆర్‌సిబి డ్రెస్సింగ్ రూమ్‌లో టీ సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. ధోనీ టి గ్లాస్‌తో నిలబడి ఉండగా, RCB జెర్సీ ధరించిన సభ్యుడు అతనికి టీ అందించినట్లు వీడియోలో కనిపిస్తుంది. RCB ఈ వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వెల్కమ్ టు బెంగుళూరు మాహీ అని క్యాప్షన్ తో షేర్ చేసింది. ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది. తనకు టీ తాగడం అంటే చాలా ఇష్టమని ఎంఎస్ ధోనీ పలు ఇంటర్వ్యూలలో చెప్పిన విషయం తెలిసిందే. రాంచీలో మా స్నేహితులను కలిసినప్పుడు తప్పకుండ టి తాగుతామని, అలాగే మైదానంలో ప్రాక్టీస్ సెషన్ పూర్తయిన తర్వాత టీ తాగడానికి ఇష్టపడతానని ధోనీ చెప్పిన వీడియోలు ఇప్పుడు సోషల్ దర్శనమిస్తున్నాయి.

ఇదిలా ఉంటె ఐపీఎల్ అనంతరం MS ధోని రిటైర్మెంట్ వార్తలు జోరందుకున్నాయి. మహీ గాయపడినప్పటికీ మ్యాచ్‌లు ఆడుతున్నాడని, బహుశా ఆటగాడిగా ఐపీఎల్‌లో ఇది అతని చివరి సీజన్ అని వార్తలు వచ్చాయి. అయితే సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ మాత్రం భిన్నమైన ఆలోచనతో ఉన్నాడు. రాబోయే కొన్ని సీజన్లలో ధోనీ మరింత ఎక్కువగా ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో ఎంఎస్ ధోని తన బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. మ్యాచ్ పరిస్థితిని అంచనా వేయడంలో ధోనీకి ఉన్న అవగాహన సాటిలేనిది. ఈ విషయం అభిమానులకు బాగా తెలుసు. ప్రస్తుత సీజన్‌లో ధోనీ ఆటతీరును పరిశీలిస్తే.. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ 13 మ్యాచ్‌ల్లో 136 పరుగులు చేశాడు. అందులో 11 ఫోర్లు, 12 సిక్సర్లు కొట్టాడు. అతని సగటు 68 మరియు స్ట్రైక్ రేట్ 226.67. అయితే ఎంఎస్ ధోనీ ఫిట్‌నెస్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. మాహీ ఇప్పుడప్పుడే రిటర్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని, అభిమానుల కోసమైనా ధోనీ ఆడాలని కోరుతున్నారు.

Also Read: Double Ismart : డబుల్ ఇస్మార్ట్.. పూరీ వాళ్లను ఎందుకు సైడ్ చేశాడు..?