RCB vs PBKS: కోహ్లీ విధ్వంసం, పంజాబ్ పై ఆర్సీబీ విజయం

ఐపీఎల్ ఆరో మ్యాచ్ ఆర్సీబీ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.

RCB vs PBKS: ఐపీఎల్ ఆరో మ్యాచ్ ఆర్సీబీ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ అత్యధిక స్కోరు 45 పరుగులు చేయగా, జితేష్ శర్మ 27 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో శశాంక్ సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి కేవలం 8 బంతుల్లోనే 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బౌలింగ్‌లో ఆర్‌సీబీకి సిరాజ్, మ్యాక్స్‌వెల్ 2-2 వికెట్లు తీశారు.

177 పరుగుల లక్ష్యఛేదనలో కింగ్ కోహ్లీ రెచ్చిపోయాడు. విరాట్ 49 బంతుల్లో 11 బౌండరీలు, 2 సిక్సర్లతో 77 పరుగులు జోడించాడు. దినేష్ కార్తీక్ బెస్ట్ నాక్ ఆడాడు. 10 బంతుల్లో 3 ఫోర్లు , 2 సిక్సర్లతో 28పరుగులతో సత్తా చాటాడు. అయితే అయితే వీరిద్దరూ మినహా  ఇతర ఆటగాళ్లు రాణించలేకపోయారు.  రజత్ పాటిదార్ 18, అనుజ్ రావత్ 11, మహిపాల్ 17 పరుగులు చేశాడు. ఫలితంగా ఆర్సీబీ 19.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11: ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11: శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్.

Also Read: RCB vs PBKS: కోహ్లీ విధ్వంసం, పంజాబ్ పై ఆర్సీబీ విజయం