Site icon HashtagU Telugu

RCB vs LSG: బెంగళూరుకు మరో ఓటమి… లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ

RCB vs LSG

RCB vs LSG

RCB vs LSG: ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సొంత గడ్డపై మరో ఓటమి ఎదురయింది.ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్న సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే డికాక్ దూకుడుగా ఆడాడు. సిరాజ్ బౌలింగ్‌లో వరుస సిక్స్‌లతో విరుచుకు పడ్డాడు. రాహుల్ సైతం హిట్టింగ్ స్టార్ట్ చేయడంతో లక్నో స్కోర్ ఫస్ట్ గేర్ లో సాగింది.

డికాక్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో పూరన్ భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. దీంతో లక్నో 181 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81 , నికోలస్ పూరన్ 21 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 40 రన్స్ తో మెరుపులు మెరిపించాడు.ఆర్‌సీబీ బౌలర్లలో గ్లేన్ మ్యాక్స్‌వెల్ రెండు వికెట్లు తీయగా..టోప్లీ, యశ్ దయాల్, సిరాజ్ తలో వికెట్ తీసారు. ఆర్‌సీబీ బౌలర్ల పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్‌ లక్నో సూపర్ జెయింట్స్‌కు కలిసొచ్చింది.

We’re now on WhatsAppClick to Join

182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. కేవలం 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కోహ్లీ 22 రన్స్ కు వెనుదిరగ్గా…ఒకే ఓవర్లో డుప్లెసిస్‌, మాక్స్‌వెల్‌ ఔటయ్యారు. అంచనాలు పెట్టుకున్న గ్రీన్ కూడా నిరాశ పరిచాడు. మయాంక్‌ యాదవ్‌ కీలక వికెట్లు పడగొట్టి బెంగుళూరును దెబ్బ కొట్టాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా మహిపాల్‌ లామ్రోర్‌ వచ్చాడు. కాసేపు మెరుపులు మెరిపించి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చాడు. కేవలం 13 బంతుల్లో 3 ఫోర్లు , 3 సిక్సర్లతో 33 రన్స్ చేశాడు. దినేష్ కార్తిక్ , లామ్రోర్‌ కీలక సమయంలో ఔట్ అవడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. చివరికి ఆర్‌సీబీ 153 రన్స్ కి ఆలౌట్ అయింది. మయాంక్‌ యాదవ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. లక్నో కి ఇది రెండో విజయం కాగా నాలుగు మ్యాచ్ లలో ఆర్‌సీబీకి ఇది మూడో ఓటమి.

Also Read: RCB vs LSG: చిన్నస్వామి స్టేడియంలో నికోలస్ పూరన్ సిక్సర్ల వర్షం