RCB vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో ఆర్సీబీ (RCB vs KKR) తలపడనుంది. కొత్త కెప్టెన్ అజింక్యా రహానే నేతృత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రంగంలోకి దిగనుంది. అదే సమయంలో ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కమాండ్ యువ బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్ చేతికి అప్పగించారు. చూడటానికి రెండు జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. కోల్‌కతా స్టార్ ఆటగాళ్లతో నిండి ఉంది. RCB కూడా మెగా వేలంలో బలహీనమైన బౌలింగ్ దాడిని బలోపేతం చేసింది.
ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎలా ఉంటుంది?
ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతా, ఆర్‌సీబీ మధ్య ఉత్కంఠ మ్యాచ్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయిస్తారని గణంకాలు చెబుతున్నాయి. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురవనుంది. ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ కారణంగా బ్యాట్స్ మెన్ బంతిని బౌండరీకి చేర్చేందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. మైదానంలో మంచి బౌన్స్ కారణంగా.. బంతి బ్యాట్‌కు అనుకూలంగా వస్తుంది. అయితే ఆరంభంలో పిచ్‌లో తేమ కారణంగా ఫాస్ట్ బౌలర్లు కూడా రాణించే అవకాశం ఉంది.
Also Read: Astronauts Shower: వ్యోమగాములు అంతరిక్షంలో స్నానం చేస్తారా? భోజనం ఎలా చేస్తారో తెలుసా?
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఈడెన్ గార్డెన్స్ మొత్తం 93 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 38 సార్లు గెలిచింది. ఇదే సమయంలో ఛేజింగ్ చేసిన జట్టు 55 మ్యాచ్‌లలో గెలిచింది. అంటే టాస్ గెలిచిన తర్వాత ముందుగా బౌలింగ్ చేయాలనే నిర్ణయం ఈ మైదానంలో మరింత ప్రయోజనకరంగా మారనుంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ పేరిట ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసింది. అదే సమయంలో RCB జట్టు 49 పరుగులకే ఆలౌట్ కూడా అయింది. ఈడెన్ గార్డెన్స్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 163 పరుగులు.
హెడ్ టూ హెడ్
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఆర్సీబీ, కోల్‌కతా నైట్ రైడర్స్ మొత్తం 34 సార్లు తలపడ్డాయి. వీటిలో కేకేఆర్ 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. IPL 2024లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో KKR రెండు మ్యాచ్‌లలో RCBని ఓడించింది.