Site icon HashtagU Telugu

RCB vs GT: సొంత మైదానంలో బెంగ‌ళూరుకు భారీ షాక్ ఇచ్చిన గుజ‌రాత్‌!

RCB vs GT

RCB vs GT

RCB vs GT: గుజరాత్ టైటాన్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs GT)ని 8 వికెట్ల తేడాతో ఓడించింది. IPL 2025లో RCB తమ హోమ్ గ్రౌండ్ అయిన ఎం చిన్నస్వామి స్టేడియంలో మొదటిసారి ఆడింది. కానీ అక్కడ వారికి నిరాశే ఎదురైంది. వరుసగా 2 విజయాలు సాధించిన తర్వాత బెంగళూరు గుజరాత్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసి 169 పరుగులు చేసింది. దానికి జవాబుగా గుజరాత్ 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సాధించింది.

ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్ గుజరాత్ విజయానికి పునాది వేశాడు. సిరాజ్ తీసిన 3 వికెట్ల కారణంగా RCBని 169 పరుగులకే కట్టడి చేయగలిగారు. బెంగళూరు తరపున లియామ్ లివింగ్‌స్టోన్ 54 పరుగులతో అర్ధసెంచరీ సాధించాడు. కానీ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పాటిదార్ వంటి ప్రముఖ బ్యాట్స్‌మెన్‌లు విఫలమయ్యారు.

విజయ హ్యాట్రిక్ చేయడంలో విఫలమైన RCB

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL 2025లో తమ మొదటి రెండు మ్యాచ్‌లను గెలిచింది. మొదట KKRని 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌పై 50 పరుగుల విజయం సాధించింది. కానీ ఇప్పుడు గుజరాత్ 8 వికెట్ల తేడాతో గెలిచి, రజత్ పాటిదార్ జ‌ట్టుకు విజయ హ్యాట్రిక్ సాధించకుండా అడ్డుకుంది.

Also Read: Japan: మొన్న మ‌య‌న్మార్‌.. నేడు జపాన్‌లో భారీ భూకంపం!

జోస్ బట్లర్, మహమ్మద్ సిరాజ్ హీరోలుగా నిలిచారు

గుజరాత్ టైటాన్స్ విజయానికి హీరోలుగా మహమ్మద్ సిరాజ్, జోస్ బట్లర్ నిలిచారు. మొదట సాయి సుదర్శన్ 36 బంతుల్లో 49 పరుగులతో గుజరాత్‌కు మంచి ఆరంభాన్ని అందించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కేవలం 14 పరుగులకే ఔట్ అయ్యాడు. కానీ జోస్ బట్లర్ బ్యాటింగ్‌లో గుజరాత్ విజయానికి హీరోగా నిలిచాడు. బట్లర్ 39 బంతుల్లో 73 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 5 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. బట్లర్‌కు ముందు మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో 3 వికెట్లు తీసి గుజరాత్ విజయానికి పునాది వేశాడు.