RCB vs GT: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs GT) బుధవారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (RCB vs GT)తో తలపడనుంది. ఈ మైదానంలో ఇప్పటివరకు రెండు జట్లు రెండుసార్లు ఆడాయి. ఒక్కో జట్టు ఒక్కో మ్యాచ్‌లో గెలిచింది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ రెండు మ్యాచ్‌లు ఆడి, రెండింటిలోనూ విజయం సాధించింది. ఇది వారి హోమ్ గ్రౌండ్‌లో తొలి మ్యాచ్ కావడంతో రజత్ పాటిదార్ నేతృత్వంలోని జట్టు అభిమానుల ముందు ఆడేందుకు ఉత్సాహంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఆర్‌సీబీ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తోంది.
మరోవైపు గుజరాత్ టైటాన్స్‌కు ఈ సీజన్ ఆరంభం నిరాశపరిచింది. పంజాబ్ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో 11 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ 243 రన్స్ చేసింది, శ్రేయాస్ అయ్యర్, శశాంక్ సింగ్ కీలక పాత్ర పోషించారు. గుజరాత్ 232 రన్స్‌కే ఆలౌట్ అయింది. అయితే, ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 196 రన్స్ చేసి, ముంబైని 160 రన్స్‌కు కట్టడి చేసి 36 రన్స్ తేడాతో గెలిచింది.
హెడ్ టు హెడ్ రికార్డ్
ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు జరిగాయి. ఆర్‌సీబీ 3 సార్లు, జీటీ 2 సార్లు గెలిచింది. చిన్నస్వామి స్టేడియంలో రెండు మ్యాచ్‌లు జరగ్గా, ఒక్కో జట్టు ఒక్కోసారి గెలిచింది
జట్ల అంచనా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాళ్.
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ శర్మ
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ఇంపాక్ట్ ప్లేయర్: మహీపాల్ లోమ్రోర్
Also Read: Cyber Crimes: ఏపీలో ‘సైబర్’ టెర్రర్.. 8 నెలల్లో రూ.600 కోట్లు లూటీ
ఎవరు గెలుస్తారో?
ఆర్‌సీబీ, జీటీ మధ్య ఐపీఎల్‌లో గట్టి పోటీ కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిదన్నది చెప్పడం కష్టం. గణాంకాల ప్రకారం ఆర్‌సీబీ ఆధిక్యంలో ఉంది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ అద్భుత ఫామ్‌లో ఉంది. ఇది వారి హోమ్ మ్యాచ్ కావడంతో రజత్ పాటిదార్ జట్టు ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే, గుజరాత్‌లో కూడా మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. వారిని తక్కువగా అంచనా వేయలేము.