Site icon HashtagU Telugu

RCB Green Jersey: నేడు గ్రీన్ జెర్సీలో ఆర్సీబీ ప్లేయర్స్.. అసలు బెంగళూరు జట్టు గ్రీన్ జెర్సీ ఎందుకు ధరిస్తుందో తెలుసా..?

rcb green jersey

rcb green jersey

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు రాజస్థాన్ రాయల్స్‌ (RR)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ భారీ మార్పులతో రంగంలోకి దిగనుంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో RCB జట్టు ఎరుపు రంగులో కాకుండా ఆకుపచ్చ రంగు జెర్సీ (Green Jersey)లో కనిపించనుంది. RCB ఆటగాళ్లు గ్రీన్ జెర్సీ ధరించడానికి కారణం చాలా ప్రత్యేకం.

పర్యావరణంపై అవగాహన కోసం RCB ఆటగాళ్లు ఎరుపు రంగుకు బదులుగా గ్రీన్ జెర్సీని ధరించి మైదానంలోకి దిగుతారు. ఈ ట్రెండ్‌ను 2011లో RCB ప్రారంభించింది. ప్రతి సీజన్‌లో తన సొంత మైదానంలో జరిగే ఒక మ్యాచ్‌లో ఎరుపు రంగుకు బదులుగా ఆకుపచ్చ జెర్సీని ఉపయోగించాలని RCB నిర్ణయించింది. గో గ్రీన్ కార్యక్రమంలో భాగంగా టాస్ సందర్భంగా ప్రత్యర్థి జట్టుకు ఒక మొక్కను గిఫ్ట్​గా అందజేస్తారు. ఈసారి సొంత మైదానంలో గ్రీన్ జెర్సీతో దిగుతోంది. దాదాపు మూడు సీజన్ల తర్వాత సొంత మైదానంలో ఈ జెర్సీ వేసుకుని ఆడనున్నారు ఆర్సీబీ ఆటగాళ్లు. అయితే గ్రీన్ జెర్సీలో RCB రికార్డు ప్రత్యేకంగా ఏమీ లేదు. గ్రీన్ జెర్సీలో RCB 11 మ్యాచ్‌లు ఆడగా, అందులో కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. గ్రీన్ జెర్సీలో ఆడిన 6 మ్యాచ్‌లలో RCB ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.

Also Read: PBKS vs MI:వాంఖడేలో ముుంబైకి షాక్.. హై స్కోరింగ్ మ్యాచ్ లో పంజాబ్ విక్టరీ

ఈ సీజన్‌లో RCB ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే ఇప్పటివరకు మిశ్రమంగా ఉంది. 16వ సీజన్‌లో RCB ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడగా, అందులో మూడింటిలో గెలిచి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిస్తే టాప్ 5లో చేరుతుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ డు ప్లెసిస్ కెప్టెన్సీ చేయొచ్చు. గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ జట్టు కమాండ్‌ని నిర్వహించాడు. అయితే, గత మ్యాచ్‌లోనూ డుప్లెసిస్ ఫీల్డింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ చేయడమే కాకుండా అద్భుత అర్ధ సెంచరీని కూడా నమోదు చేశాడు.