Site icon HashtagU Telugu

Yash Dayal : మైనర్‌పై అత్యాచారం.. యశ్ దయాల్‌పై పోక్సో కేసు నమోదు

Yash Dayal

Yash Dayal

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తరఫున ఆడుతున్న పేసర్ యశ్ దయాల్ (Yash Dayal) తీవ్ర ఆరోపణల పాలయ్యాడు. రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసాడనే ఆరోపణలతో POCSO చట్టం కింద కేసు నమోదు అయింది. బాధితురాలు ఆరోపించిన మేరకు.. యశ్ దయాల్ తనకు క్రికెట్‌లో కెరీర్ అవకాశాలు కల్పిస్తానని చెప్పి భావోద్వేగపరమైన బెదిరింపులతో లైంగికంగా వాడుకున్నాడని తెలిపింది. మొదటి దఫా ఈ ఘటన జైపూర్‌లోని సితాపురలో ఉన్న ఓ హోటల్‌లో జరిగిందని తెలిపింది.

ఈ కేసు మైనర్ బాలికపై సంబంధం ఉన్నందున, పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాధితురాలు మొదటిసారి ఈ దాడికి గురైనప్పుడు ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. యువ క్రికెటర్‌పై ఇంత తీవ్ర స్థాయిలో వచ్చిన ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. యశ్ దయాల్‌కు ఇది మొదటి సారి కాదు. ఇంతకుముందు గాజియాబాద్‌లో మరో మహిళపై లైంగిక దుర్వినియోగం కేసులో ఆయనపై FIR నమోదైంది.

#Memiddaram : జూలై 27న ఈటీవీ విన్ లో ప్రసారం కాబోతున్న మేమిద్దరం

గతంలో గాజియాబాద్ జిల్లా ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో మరో మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద కేసు నమోదు అయింది. ఆమె ఫిర్యాదులో యశ్ దయాల్ తాను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి, మోసం చేశాడని ఆరోపించారు. ఈ కేసులో యశ్ దయాల్ అరెస్టును అల్లాహాబాద్ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. హైకోర్టు బెంచ్ న్యాయమూర్తులు సిద్ధార్థ వర్మ, అనిల్ కుమార్ లు ఈ విషయాన్ని విచారిస్తూ ప్రభుత్వ న్యాయవాదికి కౌంటర్ దాఖలు చేయాలని, ఫిర్యాదుదారురాలికి నోటీసులు జారీ చేశారు.

దయాల్‌ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. పెళ్లి చేయదలచుకోకపోయినా ఎవరైనా సంబంధం పెట్టుకుంటే వెంటనే BNS సెక్షన్ 69 వర్తించదని వాదించారు. కానీ బాధితురాలు తన ఫిర్యాదులో వీరి పరిచయం ఐదేళ్లుగా ఉందని, ఎప్పటికప్పుడు పెళ్లిని వాయిదా వేస్తూ దయాల్ మోసం చేశాడని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు జూన్ 21న ముఖ్యమంత్రి గ్రీవెన్స్ పోర్టల్ (IGRS) ద్వారా అందించబడింది. వరుసగా రెండు కేసుల్లోనూ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న యశ్ దయాల్ భవిష్యత్తుపై ఈ వ్యవహారం తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.