RCB Star: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఆర్‌సీబీ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. జైపూర్‌లోని పోక్సో (POCSO) కోర్టు ఈ మేరకు స్టార్ బౌలర్‌కు షాక్ ఇస్తూ తీర్పు వెలువరించింది.
కోర్టు ఆదేశంలో ఏముంది?
జైపూర్ మెట్రోపాలిటన్ కోర్టు (POCSO కోర్టు-3) న్యాయమూర్తి అల్కా బన్సల్ తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రికార్డుల్లో ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం యశ్ దయాల్‌ను అక్రమంగా ఈ కేసులో ఇరికించినట్లు ఎక్కడా నిరూపితం కాలేదని, అందుకే ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని కోర్టు స్పష్టం చేసింది.
Also Read: భోజనం తర్వాత నిద్ర వస్తోందా? అది కేవలం బద్ధకం కాకపోవచ్చు!
ఆర్సీబీకి ఎందుకు ఇది బ్యాడ్ న్యూస్?
యశ్ దయాల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీ తరపున అద్భుత ప్రదర్శన చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఫ్రాంచైజీ, ఐపీఎల్ 2026 కోసం ఆయనను రూ. 5 కోట్లకు రిటైన్ చేసుకుంది. 2025లో 15 మ్యాచ్‌లలో 13 వికెట్లు పడగొట్టాడు. 2024లో 14 మ్యాచ్‌లలో 15 వికెట్లు తీశారు. జట్టు ప్రధాన బౌలింగ్ అస్త్రాలలో ఒకరైన దయాల్ ఇప్పుడు చట్టపరమైన ఇబ్బందుల్లో పడటం జట్టు ప్రణాళికలను దెబ్బతీసే అవకాశం ఉంది.
యశ్ దయాల్ తరపు న్యాయవాది వాదన
ఈ కేసుపై యశ్ దయాల్ తరపు న్యాయవాది స్పందిస్తూ.. యశ్ ఆ బాలికను కేవలం బహిరంగ ప్రదేశాల్లోనే కలిశారని, వారిద్దరూ ఎప్పుడూ ఏకాంతంగా కలవలేదని వాదించారు. సదరు బాలిక తనను తాను మేజర్‌గా చెప్పుకుందని, ఆర్థిక ఇబ్బందుల నెపంతో యశ్ నుండి డబ్బు తీసుకుందని, ఆపై మరిన్ని డబ్బుల కోసం వేధిస్తోందని ఆయన కోర్టుకు తెలిపారు.
IPL 2026 కోసం ఆర్‌సీబీ (RCB) పూర్తి జట్టు
- రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బేథెల్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, రసిఖ్ సలామ్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ, వెంకటేష్ అయ్యర్, మంగేష్ యాదవ్, జాకబ్ డఫీ, జోర్డాన్ కాక్స్, సాత్విక్ దేశ్వాల్, విక్కీ ఓస్త్వాల్, కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్రా.
