Site icon HashtagU Telugu

RCB vs DC: హోం గ్రౌండ్‌లో బెంగ‌ళూరు జోరు చూప‌నుందా? ఢిల్లీ వ‌రుస విజ‌యాల‌కు బ్రేక్ ప‌డుతుందా?

RCB vs DC

RCB vs DC

RCB vs DC: ఐపీఎల్ 2025లో 24వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs DC), ఢిల్లీ క్యాపిటల్స్ (RCB vs DC) మధ్య మార్చి 10న ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఢిల్లీ జట్టు ఇప్పటివరకు అజేయంగా ఉంది. వ‌రుస‌గా 3 మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. మరోవైపు ఆర్‌సీబీ జట్టు 4 మ్యాచ్‌లలో 3 విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ తమ నాల్గవ వరుస విజయాన్ని నమోదు చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆర్‌సీబీని దాని సొంత మైదానంలో ఓడించడం ఢిల్లీకి సులభం కాదు. బెంగళూరు పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది? ఇక్కడ బౌలర్లు లేదా బ్యాట్స్‌మెన్ ఎవరిది పైచేయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం!

బెంగళూరు పిచ్ రిపోర్ట్

బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్‌లకు ఉత్త‌మంగా పరిగణించబడుతుంది. ఈ మైదానంలో బ్యాట్స్‌మెన్‌లు పెద్ద షాట్లు ఆడుతూ కనిపించారు. ఇక్కడ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంది. అయితే ఆట ప్రారంభంలో బౌలర్లకు కొంత సహాయం లభిస్తుంది. ఆ తర్వాత స్పిన్నర్ల ఆధిపత్యం కనిపిస్తుంది. ఈ మైదానంలో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది. కెప్టెన్లు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

Also Read: Jio Recharge Plan: జియో యూజ‌ర్ల‌కు శుభవార్త‌.. త‌క్కువ ధ‌ర‌కే రీఛార్జ్‌!

ఎం. చిన్నస్వామి గణాంకాలు

ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటివరకు 95 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ సమయంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 41 మ్యాచ్‌లు గెలిచింది. రన్‌లను ఛేజ్ చేసిన జట్టు 50 సార్లు విజయం సాధించింది. ఈ పిచ్‌పై మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 171 ప‌రుగులు. అయితే ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ఇదే మైదానంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు 287 రన్‌లు చేసింది. అతి తక్కువ స్కోరు 82 ప‌రుగులు.

ఇరు జ‌ట్ల అంచ‌నా

ఆర్సీబీ: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికారా, లియామ్ లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జోష్ హాజిల్‌వుడ్

డీసీ: కేఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, డోనోవన్ ఫెరీరా, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), సమీర్ రిజ్వీ, ఆశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్.