రెండు కొత్త జట్ల రాకతో క్యాష్ రీచ్ లీగ్ ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో తలపడబోతున్న అన్ని జట్లలో 9 జట్లు తమ కెప్టెన్లు ఎవరో ప్రకటించాయి. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఫ్రాంచైజీ మాత్రం ఇంకా తమ జట్టు కెప్టెన్ ఎవరో చెప్పలేదు.. ఇక ఐపీఎల్-2021 సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్నాడు. అయితే తర్వాత కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్ అవుతాడని అంతా భావించారు.
ఈ క్రమంలోనే మిస్టర్ 360 ఐపీఎల్ నుంచి తప్పుకుని అందరని షాక్‌కు గురి చేశాడు. ఇక దినేష్ కార్తీక్, గ్లేన్ మాక్స్‌వెల్, ఫాప్ డుప్లెసిస్ ముందు వరుసలో ఉన్నప్పటికీ ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇందులో దినేశ్ కార్తీక్ ఒక్కడికే ఐపీఎల్‌లో సారథిగా వ్యవహరించిన అనుభవం ఉంది.. అలాగే ఫాఫ్ డుప్లెసిస్‌కి దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా చేసిన అనుభవం ఉంది. అయితే.. వీరిద్దరికీ కాకుండా మాక్స్‌వెల్‌కి ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అప్పగించాలని బెంగళూరు ఫ్రాంచైజీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే ఈ ఈసారి ట్రోఫీని ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న ఆర్సీబీ ఐపీఎల్ 2022వ సీజన్ మెగా వేలంలో కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2021 సీజన్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన హర్షల్‌పటేల్‌ను రూ. 10.75 కోట్లకు దక్కించుకున్న ఆర్సీబీ .. శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగాను కూడా భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అంతకుముందు రిటెన్షన్ ప్రక్రియలో విరాట్ కోహ్లి, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌తో పాటు మహ్మద్ సిరాజ్ ను రిటైన్ చేసుకుంది.
RCB: కౌన్ బనేగా RCB కెప్టెన్ ?

Rcb Ipl