Site icon HashtagU Telugu

RCB IPL 2022 : బెంగళూరు కొనుగోలు చేసింది వీళ్లనే

Rcb Ipl

Rcb Ipl

బెంగళూరు వేదికగా రెండు రోజులు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం ముగిసింది. వేలంలో మొత్తం 204 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. వీరిలో 67 మంది విదేశీ ఆటగాళ్లు​ ఉండగా..137 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు.. టోర్నీలోని ప్రతి ఫ్రాంఛైజీకి రూ.90 కోట్లని బీసీసీఐ కేటాయించింది. గరిష్ఠంగా 25 మంది ఆటగాళ్లని తీసుకునే వెసులబాటు ఉండగా.. ఆర్సీబీ కేవలం 22 మందినే తీసుకుంది. ఐపీఎల్2022 సీజన్ లో ఎలాగైనా టైటిల్ సాధించాలనే ఉద్దేశ్యంతో ఉన్న ఆర్‌సీబీ పక్కాగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వేలం ముంగిట విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌తో పాటు మహమ్మద్ సిరాజ్‌లను రిటెయిన్‌ చేసుకున్న ఆర్‌సీబీ వేలంలోనూ మరోసారి స్టార్ ఆటగాళ్లనే కొనుగోలు చేసింది. వావిదు హసరంగను రూ. 10.75 కోట్లు,హర్షల్‌ పటేల్‌ ను రూ . 10.75 కోట్లు, ఫాఫ్ డుప్లెసిస్‌ ను రూ. 7 కోట్లకు బెంగళూరు ఫ్రాంచైజీ దక్కించుకుంది.. అలాగే దినేశ్‌ కార్తీక్‌ ను రూ. 5.5 కోట్లు, జోష్ హేజిల్ వుడ్‌ ను రూ. 7.75 కోట్లు, షాబాజ్‌ అహ్మద్‌ ను రూ. 2.4 కోట్లు, అనుజ్‌ రావత్‌ ను రూ. 3.4 కోట్లు, డేవిడ్‌ విల్లే ను రూ. 2 కోట్లు, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్‌ ను రూ. కోటికి ఆర్సీబీ దక్కించుకుంది.. అలాగే మహిపాల్‌ లామ్రోర్‌ ను రూ. 95 లక్షలు, ఫిన్‌ అలెన్‌ ను రూ. 80 లక్షలు, జేసన్‌ బెహ్‌రెండోర్ఫ్‌ ను రూ. 75 లక్షలు, సిద్ధార్థ్‌ కౌల్‌ ను రూ. 75 లక్షలు,కర్ణ్‌ శర్మ ను రూ 50 లక్షలు, చామ మిలింద్‌ ను రూ. 25 లక్షలు, సుయాశ్‌ ప్రభుదేశాయ్‌ ను రూ. 30 లక్షలు, ఆకాశ్‌ దీప్‌ ను అనీశ్వర్‌ గౌతమ్‌, లువ్‌నిత్‌ సిసోడియా ను తలో రూ. 20 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.