Site icon HashtagU Telugu

RCB vs GT : హ్యాట్రిక్ పై ఆర్సీబీ కన్ను..గుజరాత్ తో పోరుకు బెంగళూరు రెడీ

Rcbvsgt

Rcbvsgt

ఐపీఎల్ 18వ సీజన్ (IPL 18) లో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసింది. సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ (RCB vs GT ) తో తలపడబోతోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా పరుగుల వరదే… ఇరు జట్లలోనూ టీ ట్వంటీ హిట్టర్స్ ఉండడంతో రన్ ఫెస్టివల్ గానే చెబుతున్నారు. కాగా ఈ సీజన్ లో ఆర్సీబీ అద్భుతమైన ఫామ్ లో ఉంది. తొలి మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ను ఓడించిన బెంగళూరు తర్వాత రెండో మ్యాచ్ లో చెన్నైకి షాకిచ్చింది.

Painting Exhibition: రూ.వెయ్యికే 8.5 కోట్ల విలువైన చిత్రం.. తలలు పట్టుకున్న నిర్వాహకులు

17 ఏళ్ళ తర్వాత చెపాక్ స్టేడియంలో విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తమ హౌం గ్రౌండ్ లో కూడా ఖచ్చితంగా ఆర్సీబీనే హాట్ ఫేవరెట్. ఆ జట్టు బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ , కోహ్లీ, పటిదార్ , పడిక్కల్ ఫామ్ లో ఉన్నారు. లియామ్ లివింగ్ స్టోన్ ఫినిషర్‌గా పాత్ర పోషించనుండగా.. వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మ కొనసాగనున్నాడు. టీమ్ డేవిడ్‌, కృనాల్ పాండ్యాలతో 8వ స్థానం వరకు ఆర్‌సీబీ బ్యాటింగ్ లైనప్ బలంగానే కనిపిస్తోంది.

బౌలింగ్ లోనూ ఆర్సీబీ నిలకడగా రాణిస్తోంది. గత రెండు విజయాల్లో బౌలర్లు అదరగొట్టారు. హ్యాజిల్ వుడ్ తన ఫామ్ కంటిన్యూ చేస్తుండగా.. రెండో మ్యాచ్ లో భువనేశ్వర్ కూడా తోడయ్యాడు. ఇక యశ్ దయాల్ డెత్ ఓవర్లలో దుమ్మురేపుతున్నాడు. ఈ ముగ్గురు కీలక వికెట్లు పడగొడుతూ బ్రేక్ త్రూ ఇస్తున్నారు. స్పిన్ విభాగంలో సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యానే కీలకం కానున్నారు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా కాన్ఫిడెంట్ గానే బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్ లో పంజాబ్ పై ఓడినా తర్వాత ముంబై ఇండియన్స్ ను ఓడించి బోణీ కొట్టింది. బ్యాటింగ్ లో సాయిసుదర్శన్, బట్లర్, గిల్ అదరగొడుతున్నారు. ఈ ముగ్గురు చెలరేగుతుండడంతోనే గుజరాత్ కు మంచి స్కోర్లు వస్తున్నాయి. మిగిలిన బ్యాటర్లలో రూథర్ ఫర్డ్ , తెవాటియా, షారూఖ్ ఖాన్ ఇంకా అంచనాలు అందుకోలేదు. వీరు కూడా రాణిస్తే గుజరాత్ కు తిరుగుండదు. బౌలింగ్ లో మహ్మద్ సిరాజ్ ఫామ్ అందుకున్నాడు. గత మ్యాచ్ లో పవర్ ప్లేలోనే కీలక వికెట్లు తీశాడు. అలాగే ప్రసిద్ధ కృష్ణ , రషీద్ ఖాన్ కూడా గుజరాత్ బౌలింగ్ కు కీలకంగా చెప్పొచ్చు.