Site icon HashtagU Telugu

RCB vs GT: శుభమన్ గిల్ దెబ్బకి బెంగళూరు ఔట్.. ప్లేఆఫ్స్‌కి ముంబయి

Shubman Gt Vs Rcb

Shubman Gt Vs Rcb

RCB vs GT: ఐపీఎల్ 2023 సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ లీగ్ దశలోనే ఆదివారం రాత్రి నిష్క్రమించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో శుభమన్ గిల్ (104 నాటౌట్ 52 బంతుల్లో ) సెంచరీ బాదడంతో బెంగళూరు టీమ్‌ని 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఓడించేసింది. మ్యాచ్‌లో అంతకముందు విరాట్ కోహ్లీ (101 నాటౌట్: 61 బంతుల్లో 1) శతకం బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్ 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ ఫలితంతో ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్ లో మిగిలిన నాలుగు జట్లను ఖరారు చేశారు. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకున్నాయి.

198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 12 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. దీని తర్వాత శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను విజయ్ శంకర్ స్వీకరించాడు. ఇద్దరి బ్యాటింగ్‌ ఫలితంగా గుజరాత్ స్కోరు 148కి చేరింది. అనంతరం 35 బంతుల్లో 53 పరుగులు చేసి విజయ్ శంకర్ ఔటయ్యాడు. ఫాస్ట్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, విజయ్ కుమార్ వైషాక్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు. గిల్ 52 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడం విశేషం.

వర్షం కారణంగా ఆట దాదాపు గంట ఆలస్యంగా ప్రారంభమైంది.

టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన RCB జట్టు మొదటి రెండు ఓవర్లలో 10 పరుగులు మాత్రమే చేసింది, వర్షం కారణంగా దాదాపు గంటపాటు ఆలస్యమైన ఆటను RCB జట్టు నెమ్మదిగా ప్రారంభించింది. మహ్మద్ షమీపై ఫాఫ్ డుప్లెసీ నాలుగు ఫోర్లు కొట్టగా, యశ్ దయాళ్‌పై కోహ్లీ వరుసగా మూడు ఫోర్లు కొట్టి చిన్నస్వామి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. పవర్ ప్లేలో ఆర్‌సీబీ వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. అయితే డుప్లెసి పెద్ద ఇన్నింగ్స్ ఆడలేక 19 బంతుల్లో 28 పరుగులు చేసి నూర్ అహ్మద్ (39 పరుగులకు 2) క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అహ్మద్ వేసిన ఓవర్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ (11) ఒక సిక్సర్, ఒక ఫోర్ బాదాడు కానీ తర్వాతి ఓవర్‌లో రషీద్ ఖాన్ (24 పరుగులకు 1) వికెట్లను చెదరగొట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.

Exit mobile version