RCB Captains: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాత మార్చే కెప్టెన్ కోసం ఎదురు చూస్తుంది.ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి ఆ జట్టు టైటిల్ గెలవలేదు. అయినప్పటికీ ఆ ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు. దానికి కారణం విరాట్ కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గతేడాది టైటిల్ రేసులో ఆర్సీబీ నిలిచినప్పటికీ ఆర్ఆర్ చేతిలో ఓటమి ఆ జట్టును టైటిల్ కి దూరం చేసింది.
ఆర్సీబీ (rcb captains) చాలా మంది కెప్టెన్లను మార్చింది. రాహుల్ ద్రవిడ్ ఆర్సీబీకి తొలి కెప్టెన్గా వ్యవహరించాడు. ఐపీఎల్ 2008లో ఫ్రాంచైజీ కెప్టెన్సీని ద్రవిడ్‌కు అప్పగించింది. అయితే ద్రవిడ్ ఒక సీజన్ మాత్రమే ఆర్సీబీకి కెప్టెన్‌గా కొనసాగాడు. తరువాతి సీజన్‌లో కెప్టెన్‌ని మార్చారు. ఇప్పటివరకు మొత్తం ఏడుగురు కెప్టెన్లు మారారు. ద్రవిడ్ తర్వాత కెవిన్ పీటర్సన్ ఆర్సీబీ పగ్గాలు చేపట్టాడు. అయితే అదే సీజన్‌లో అనిల్ కుంబ్లేను కెప్టెన్ చేశారు. దీంతో కుంబ్లే 2 సంవత్సరాలు కెప్టెన్‌గా కొనసాగాడు. కుంబ్లే తర్వాత 2011లో డేనియల్ వెట్టోరీ కెప్టెన్ అయ్యి రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగాడు. విరాట్ కోహ్లీ 2011లో కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 2021 వరకు కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగాడు.కోహ్లీ 11 సంవత్సరాల పాటు ఆర్సీబీని నడిపించాడు. ఈ కాలంలో విరాట్ ఆర్‌సిబికి ట్రోఫీని అందించకపోయినా కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.
కోహ్లి (kohli) మొత్తం 143 మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 66 మ్యాచ్‌లను గెలిపించాడు. 70 మ్యాచ్‌లలో ఆర్సీబీ ఓడింది. కోహ్లీ తర్వాత షేన్ వాట్సన్, ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్లుగా ఉన్నారు. 2022లో జరిగిన మెగా వేలంలో ఫాఫ్ డు ప్లెసిస్‌ని ఆర్సీబీ కొనుగోలు చేసి కెప్టెన్ బాధ్యతలని అప్పగించింది. ఫాఫ్ కెప్టెన్సీలో ఆర్సీబీ 42 మ్యాచ్‌లు ఆడింది, అందులో 21 మ్యాచ్‌లు గెలిచింది. మరో 21 మ్యాచ్‌లు ఓడింది. అయితే వచ్చే సీజన్ నాటికి ఆర్సీబీకి కొత్త కెప్టెన్ ను పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తుంది. మెగా వేలం నుండి మరొక కెప్టెన్ మెటీరియల్ ప్లేయర్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్సీబీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: RBI : 14 ఏళ్లలో IPOల కోసం అత్యంత రద్దీ నెలగా సెప్టెంబర్