Site icon HashtagU Telugu

Smriti Mandhana: ఆర్‌సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధాన.. ప్రకటించిన కోహ్లీ, డుప్లిసిస్

virat and smriti

Resizeimagesize (1280 X 720) (3) 11zon

మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మహిళల భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ స్మృతి మంధాన (Smriti Mandhana) కెప్టెన్‌గా ఎంపికైంది. శనివారం ఉదయం ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ ఫాఫ్ డుప్లెసీ మంధానను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ఆర్సీబీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. డబ్ల్యుపిఎల్ ఆటగాళ్ల వేలంలో 26 ఏళ్ల భారత బ్యాట్స్‌మన్ మంధానను ఆర్‌సిబి రెండు రోజుల క్రితం రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్‌లో ఆమె అత్యంత ఖరీదైన క్రీడాకారిణి కూడా.

టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వేగంగా పరుగులు చేయగల సత్తా ఉంది. ఆమెకు నాయకత్వ గుణం కూడా ఉంది. మంధాన 112 టీ20 మ్యాచుల్లో 123.13 స్ట్రైక్ రేట్‌తో 2651 పరుగులు చేసింది. ఆమె పేరు మీద 20 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. WPL వేలంలో స్మృతి మంధాన అత్యంత ఖరీదైనక్రీడాకారిణి . 3.40 కోట్లకు ఆమెని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఆమెతో పాటు రేణుకా సింగ్, సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్‌లను కూడా జట్టు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే గార్డనర్, ఇంగ్లండ్‌కు చెందిన నటాలీ స్కివర్ బ్రంట్ అత్యంత ఖరీదైన విదేశీ క్రీడాకారులు.

Also Read: David Warner: డేవిడ్ వార్నర్‌కి గాయం.. సబ్‌స్టిట్యూట్‌గా మరో ప్లేయర్..!

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మార్చి 4న ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్-ముంబై మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. కాగా ఫైనల్ మ్యాచ్ మార్చి 26న ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరగనుంది. లీగ్ మొత్తం ఈ రెండు స్టేడియాల్లోనే జరగనుంది.23 రోజుల్లో 5 జట్లు 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి. 20 లీగ్‌లు, ఒక ఎలిమినేటర్, ఒక ఫైనల్ ఉంటాయి. మొదటి సీజన్‌లో నాలుగు డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఆడనున్నారు. లీగ్ తొలి సీజన్‌లో 5 జట్లు పాల్గొంటున్నాయి. వీటిలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యుపి వారియర్స్ ఉన్నాయి.