CSK vs KKR: జడేజాను ఆపిన ధోనీ.. నిన్న మ్యాచ్ లో ఇది గమనించారా?

చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. చెన్నై, కేకేఆర్ లాంటి బలమైన జట్లు పోటీ పడితే మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగుతుందనుకుంటే ఆరంభంలోనే మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ఈ సీజన్లో ఓటమెరుగని కేకేఆర్ అడ్డొచ్చిన జట్టుని తొక్కుకుంటూ ముందుకు సాగింది.

CSK vs KKR: చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. చెన్నై, కేకేఆర్ లాంటి బలమైన జట్లు పోటీ పడితే మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగుతుందనుకుంటే ఆరంభంలోనే మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ఈ సీజన్లో ఓటమెరుగని కేకేఆర్ అడ్డొచ్చిన జట్టుని తొక్కుకుంటూ ముందుకు సాగింది. ప్రత్యర్థి జట్లపై భారీ స్కోర్ చేయడమే కాకుండా బౌలింగ్ దళంతో బ్యాటర్లని ముప్పుతిప్పలు పెట్టింది. గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో కేకేఆర్ జట్టుకు తిరుగులేకుండాపోతుంది అనుకున్న సమయంలో చెన్నై అడ్డుగోడగా నిలిచి తమ హోమ్ గ్రౌండ్స్ లో కెకెఆర్ని చిత్తూ చేసింది. ఈ ఫలితాన్ని ఎవ్వరూ ఊహించలేదు.

భీకర బ్యాటింగ్ దళంతో నిండి ఉన్న కోల్కతా జట్టు టాపార్డర్ పూర్తిగా చేతులెత్తేసింది. బౌలర్ అయిన సునీల్ నరైన్ క్రీజులో ఉన్నప్పుడు మరో బౌలర్ కాస్త ఒళ్ళు దెగ్గరపెట్టుకుని బౌలింగ్ చేయాల్సి వస్తుంది. ఆ ఇంపాక్ట్ ని నరైన్ కల్పించాడు. నరైన్ విధ్వంసం ముందే ఉహించిన చెన్నై బౌలర్లు ఆచితూచి బౌలింగ్ వేశారు. చెన్నై బౌలర్ల ధాటికి నరైన్ కూడా నెమ్మదిగా ఆడటం మొదలుపెట్టాడు. తొలి బంతికి తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్, నరైన్ ఉన్నాడన్న ధైర్యంతో ముందుకు సాగింది. కానీ విచిత్రంగా నరైన్ అందరి అంచనాల్ని తలకిందులు చేసి కేవలం 27 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ ఒక్క వికెట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. మిగతా బ్యాటర్లు రాణిస్తారనుకుంటే జడేజా ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతర్వాత మ్యాచ్ పూర్తిగా చెన్నై చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చెన్నై ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. బౌలర్లు కేకేఆర్ బ్యాటర్లని మట్టి కరిపించేశారు. ఈ పరిస్థితుల్లో కోల్కత్త అతి కష్టం మీద 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన కోల్​కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 34 పరుగులతో ఒక్కడే రాణించాడు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ తొలి బంతికే వెనుదిరగగా రఘువంశీ 24 పరుగులతో సరిపెట్టాడు. ఇక భారీ ఆశలు పెట్టుకున్న సునీల్ నరైన్ 27 పరుగులకె అవుట్ అయ్యాడు, వెంకటేశ్ అయ్యర్ 3, రమన్​దీప్ సింగ్​ 13 , రింకూ సింగ్ 9 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచారు. అయితే చివర్లో కేకేఆర్ హార్డ్ హిట్టర్ అండ్రూ రస్సెల్ కూడా కన్సిస్టెన్సీగా ఆడలేకపోయాడు. రస్సెల్ 10 పరుగులకె అవుట్ అవ్వడం ద్వారా కేకేఆర్ స్వల్ప స్కోరుతో సరిపెట్టుకుంది.

స్వల్ప లక్ష్య ఛేదనలో చెన్నై తొలుత నిలకడగా ఆడుతూ కనిపించింది. ఈ క్రమంలో ఓపెనర్ రచిన్ రవీంద్ర 15 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ రుతురాజ్ క్రీజులో పాతుకుపోయాడు. ఈ క్రమంలో రుతురాజ్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. డారిల్ మిచెల్ 25 పరుగుల​తో రాణించాడు. వీరిద్దరూ రెండో వికెట్​కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 12 ఓవర్లో సునీల్ నరైన్​ అద్భుత బంతికి డారిల్ మిచెల్ క్లీన్​ బౌల్డయ్యాడు. మిచెల్ ఔట్ అయిన త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన శివమ్ దూబే 28 పరుగుల ధ‌నాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే శివమ్ దూబే ఔటయ్యాక రవీంద్ర జడేజా బ్యాటింగ్‍కు రెడీ అయ్యాడు. అప్పుడు ఫ్యాన్స్ నో అంటూ బిగ్గరగా కేకలు పెట్టారు. దీంతో ధోనీ జడేజాను ఆపి తాను బ్యాటింగ్ కు వచ్చాడు.హోం గ్రౌండ్‍లో మాహీ బ్యాటింగ్ చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. ఎలాగో మ్యాచ్ విజయం ఖాయం అయింది కాబట్టి జిడ్డుని ఆపి ఫ్యాన్స్ కోసం ధోని బరిలోకి దిగాడు. ధోనీ గ్రౌండ్‍లోకి వచ్చిన సమయంలో చెపాక్ స్టేడియంలో మోతెక్కించారు ప్రేక్షకులు. ఆ సమయానికి క్రీజులో గైక్వాడ్ ఉన్నాడు. చివరి వరకు స్టాండ్ ఇచ్చిన రుతురాజ్ గైక్వాడ్ 58 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చివర్లో ధోనీ 1 పరుగు తీయడంతో విజయం చెన్నైని వరించింది.

కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగుల చేస్తే… చెన్నై 17.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి త్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. కాగా ఈ సీజన్‍లో కోల్‍కతాకు ఇది తొలి ఓటమి.మొత్తంగా ఈ మ్యాచ్ లో జ‌డేజా, తుషార్ దేశ్ పాండేలు కేకేఆర్ ను త‌మ బౌలింగ్ తో చెడుగుడు ఆడుకున్నారు. జ‌డ్డూ భాయ్ ఒకే ఓవ‌ర్ లో రెండు వికెట్లు తీసి కోల్ క‌తాకు షాక్ ఇచ్చాడు. మొత్తంగా 4 ఓవ‌ర్ల త‌న బౌలింగ్ తో 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో కేకేఆర్ పై 22 వికెట్లు సాధించాడు. అయితే జడేడా అటు బౌలింగ్ లోనే కాకుండా.. ఇటు ఫీల్డింగ్ లోనూ ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతిని సాల్ట్ గాల్లోకి లేపగా.. దానిని జడేజా అద్భుతంగ ఒడిసి పట్టాడు. ఈ క్యాచ్ తో జిడ్డు తన ఐపీఎల్ కెరీర్లో 99వ క్యాచ్ పట్టాడు. మరో బౌలర్ తుషార్ దేశ్ పాండే సైతం కేకేఆర్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. దేశ్‌పాండే నాలుగు ఓవర్లలో 3 వికెట్లు తీసుకున్నాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా చెన్నై విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో 2 వికెట్లు సాధించాడు. దీంతో ఈ సీజన్ ఐపీఎల్ లో అత్య‌ధిక వికెట్లు తీసుకున్న బౌల‌ర్ గా నిలిచాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ 4 మ్యాచ్ ల‌లో కలిపి 14.22 సగటుతో 9 వికెట్లు పడగొట్టాడు.

Also Read: Lizard Astrology for Female: స్త్రీ శరీరంపై బల్లి ఎక్కడ పడితే ఏమవుతుంది?