Site icon HashtagU Telugu

WTC Final 2023: జడేజాని అందుకే తీసుకోలేదు: నాజర్ హుస్సేన్

WTC Final 2023

New Web Story Copy 2023 06 01t160816.811

 

WTC Final 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం టెస్ట్ XI సిద్ధమైంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ భారత్ -ఆస్ట్రేలియాతో కూడిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం తన టెస్ట్ XIని ఎంపిక చేశాడు. టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం ఒక స్పిన్నర్ మాత్రమే ఎంపికయ్యాడు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్ జూన్ 7 నుండి లండన్‌లోని ఓవల్ మైదానంలో భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. ఇటీవల భారత జట్టు స్వదేశంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించింది. ఇందులో స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా 47 వికెట్లు తీశారు. మరోవైపు ఆస్ట్రేలియన్ స్పిన్నర్లు ద్వయం నాథన్ లియాన్ మరియు టాడ్ మర్ఫీ 36 వికెట్లను పడగొట్టారు. ఇదిలా ఉండగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో రవీంద్ర జడేజాకు చోటు దక్కలేదు. రవిచంద్ర అశ్విన్ వైపే మొగ్గుచూపాడు నాజర్ హుస్సేన్

అయితే ఈ సిరీస్ లో జడేజాను ఎందుకు తీసుకోలేదో నాజర్ హుస్సేన్ క్లారిటీ ఇచ్చారు. నాజర్ హుస్సేన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. “ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ భారతదేశంలో జరిగితే జడేజాను ఆరో స్థానంలో తీసుకునేవాడిని. కానీ ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌లో జరుగుతున్నందున నేను అలా చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. కెమరూన్ గ్రీన్ ఆల్ రౌండర్‌గా నా జట్టులో ఉంటాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిదో స్థానంలో ఉంటాడని నాజర్ హుస్సేన్ తెలిపారు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ XI: రోహిత్ శర్మ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ మరియు మహ్మద్ షమీ.

Read More: Ruturaj Gaikwad: పెళ్లి పీటలు ఎక్కనున్న రుతురాజ్ గైక్వాడ్.. కాబోయే భార్య కూడా క్రికెటరే.. ఆమె ఎవరో తెలుసా..?

Exit mobile version