Site icon HashtagU Telugu

Jadeja- Carse: కార్స్- జడేజా మధ్య తీవ్ర వాగ్వాదం.. వీడియో వైర‌ల్‌!

Jadeja- Carse

Jadeja- Carse

Jadeja- Carse: లార్డ్స్ మైదానంలో భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరిత మలుపు తిరిగింది. ఐదవ రోజు ఆరంభం టీమ్ ఇండియాకు అనుకూలంగా లేదు. రిషభ్ పంత్ బ్యాట్‌తో పెద్దగా సత్తా చాటలేక కేవలం 9 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. జోఫ్రా ఆర్చర్ అతన్ని క్లీన్ బౌల్డ్ చేసి ఔట్ చేశాడు. కేఎల్ రాహుల్ కూడా 39 పరుగులు చేసి ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్‌ను ఆర్చర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపాడు. వరుసగా మూడు వికెట్లు తీసిన ఇంగ్లీష్ జట్టు మ్యాచ్‌లో పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తోంది. మ్యాచ్ సమయంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్- రవీంద్ర జడేజా (Jadeja- Carse) మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ విషయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మధ్యవర్తిత్వం చేయవలసి వచ్చింది.

జడేజా-కార్స్ మధ్య మైదానంలో ఘర్షణ

ప్రారంభ గంటలోనే భారత్ ముగ్గురు కీలక బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపి ఇంగ్లాండ్ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం సాధించింది. రవీంద్ర జడేజా- నీతీశ్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్‌ను స్థిరపరచడానికి ప్రయత్నించారు. 35వ ఓవర్‌లో బ్రైడన్ కార్స్ వేసిన బంతిని జడేజా షాట్ ఆడి.. రన్ కోసం పరుగెత్తాడు. జడేజా దృష్టి పూర్తిగా బంతిపైనే ఉంది. అతను ఎదురుగా నిలబడిన బౌలర్ కార్స్‌ను గమనించలేదు. దీంతో ఇద్దరి మధ్య ఢీకొన్నారు. ఆ తర్వాత ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ కార్స్ కోపంతో జడేజాతో ఏదో మాట్లాడుతూ కనిపించాడు. జడేజా కూడా కార్స్ వైపు వెళ్లి తన వాదనను వినిపించే ప్రయత్నం చేశాడు.

Also Read: PF Money: పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం డ‌బ్బును ఒకేసారి డ్రా చేయొచ్చా?

కార్స్- జడేజా మధ్య గొడవ పెరగడం చూసిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మధ్యవర్తిత్వం చేయడానికి రావలసి వచ్చింది. టెస్ట్ ఐదవ రోజున హోస్ట్ జట్టు ఆటగాళ్లు భారత బ్యాట్స్‌మెన్‌లను రెచ్చగొట్టే ప్రయత్నంలో చాలాసార్లు కనిపించారు.

ఆర్చర్ విజృంభణ

టెస్ట్ ఐదవ రోజు ఆరంభం టీమ్ ఇండియాకు అనుకూలంగా లేదు. జోఫ్రా ఆర్చర్ వేసిన అద్భుతమైన బంతికి రిషభ్ పంత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పంత్ ఔట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ కూడా 39 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఒక పరుగు తర్వాత ఆర్చర్.. వాషింగ్టన్ సుందర్‌ను ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపాడు.

భారత్ 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో 125/8 వద్ద ఉంది. ఇంకా 70 పరుగులు అవసరం. రవీంద్ర జడేజా (24*), నీతీశ్ కుమార్ రెడ్డి (13) కొంత ప్రతిఘటన చూపించారు. కానీ నితీష్ లంచ్ సమయంలో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆర్చర్ తన 10 ఓవర్లలో 41 ప‌రుగులు ఇచ్చి 3 కీల‌క వికెట్లు తీసుకున్నాడు. అయితే స్టోక్స్ తన 15.2 ఓవర్లలో రాహుల్‌ను ఔట్ చేసి కీలక విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్‌కు విజయం సాధించడానికి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అవ‌స‌రం. ప్ర‌స్తుతం క్రీజులో జ‌డేజా, బుమ్రా ఉన్నారు.