Site icon HashtagU Telugu

Ravindra Jadeja: ఇర్ఫాన్ పఠాన్ రికార్డు బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా

Ravindra Jadeja

New Web Story Copy 2023 09 13t180800.857

Ravindra Jadeja: ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఇర్ఫాన్ పఠాన్ రికార్డును రవీంద్ర జడేజా బద్దలు కొట్టాడు. ప్రస్తుతం పాకిస్థాన్, శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ వన్డే సిరీస్‌లో భారత జట్టు ఆడుతోంది. నిన్న సెప్టెంబర్ 12 కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఇందులో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన స్పిన్నర్ జడేజా 33 పరుగులిచ్చి కెప్టెన్ సనక, డిసిల్వా వికెట్లు తీశాడు. దీంతో ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఇర్ఫాన్ పఠాన్ రికార్డును జడేజా బద్దలు కొట్టాడు. ఆసియా కప్ సిరీస్‌లో 2004 నుంచి 2012 వరకు 12 వన్డే ఇన్నింగ్స్‌లలో 22 వికెట్లు తీసి పఠాన్ భారత్ తరఫున రికార్డు సృష్టించాడు. దాన్ని అధిగమించేందుకు జడేజా 17 ఇన్నింగ్స్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 24 ఇన్నింగ్స్‌ల్లో 30 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఆసియా కప్ (ODI) చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితా:

ముత్తయ్య మురళీధరన్ – 24 ఇన్నింగ్స్‌ల్లో 30 వికెట్లు
లసిత్ మలింగ – 14 ఇన్నింగ్స్‌ల్లో 29 వికెట్లు
అజంతా మెండిస్ – 8 ఇన్నింగ్స్‌ల్లో 26 వికెట్లు
సయీద్ అజ్మల్ – 12 ఇన్నింగ్స్‌ల్లో 25 వికెట్లు
రవీంద్ర జడేజా – 17 ఇన్నింగ్స్‌ల్లో 24 వికెట్లు
సమిందా వాజ్ – 19 ఇన్నింగ్స్‌ల్లో 23 వికెట్లు
ఇర్ఫాన్ పఠాన్ – 12 ఇన్నింగ్స్‌ల్లో 22 వికెట్లు

Also Read: AP : ‘తండ్రి’ శవం వద్ద సంతకాల కోసం ట్రై చేసిన ‘స్కిల్’ జగన్ మోహన్ రెడ్డిది – రేణుకా చౌదరి