Site icon HashtagU Telugu

Jadeja Retirement: రోహిత్, కోహ్లీ బాటలో జడ్డూ.. రిటైర్మెంట్ ప్రకటనలు

Jadeja Retirement

Jadeja Retirement

Jadeja Retirement: టి20 ప్రపంచ కప్ 2024లో భారత్ టైటిల్ గెలుచుకుంది. ఈ టైటిల్‌ విజయం తర్వాత విరాట్‌ కోహ్లి ఓ కీలక ప్రకటన చేశాడు. అంతర్జాతీయ టి-20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత, భారత్‌కు ఇదే తన చివరి టీ20 మ్యాచ్ అని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో స్పష్టంగా చెప్పాడు. విరాట్ నిర్ణయాన్ని గౌరవిస్తూ, అభిమానులు సోషల్ మీడియాలో అతనిని సంతోషపెడుతున్నారు.

టీ20 ప్రపంచకప్-2024 టైటిల్‌ను భారత్ గెలుచుకున్న వెంటనే, వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీని తర్వాత విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ కూడా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి రవీంద్ర జడేజా చేరిపోయాడు. ఈ సందర్భంగా జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఇక భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. వన్డే ప్రపంచకప్ ఓటమి బాధను చెరిపేస్తూ టీమిండియా టీ ట్వంటీల్లో విశ్వవిజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. అసలు ఓడిపోయే మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో భారత్ గెలిచింది.

Also Read: Woakes Returns: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కు ఇంగ్లండ్ తుది జట్టు