Site icon HashtagU Telugu

IPL 2022 Auction : రాజస్థాన్‌కు అశ్విన్‌.. సగం ధరకే కమ్మిన్స్‌

Ravichandra Ashwin

Ravichandra Ashwin

ఐపీఎల్ మెగావేలంలో రెండో ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. అతని కోసం గట్టిపోటీనే నడిచింది. కనీస ధర. రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చిన అశ్విన్‌ను 5 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ కైవసం చేసుకుంది. వేలంలో మూడో ఆటగాడిగా ఆస్ట్రేలియా సీనియర్‌ పేసర్ ప్యాట్ కమిన్స్ వచ్చాడు,, కమిన్స్ కనీస ధర రూ.2 కోట్లు. గత సీజన్‌లో కేకేఆర్ తరపున కమిన్స్ ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈసారి వేలంలో కూడా కమిన్స్ ను కేకేఆర్ ఫ్రాంచైజీ రూ.7. కోట్లకు దక్కించుకుంది. గతంతో పోలిస్తే సగం ధరకే కమ్మిన్స్‌ను సొంతం చేసుకుంది. కేకేఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి డబ్బులు మిగుల్చుకున్నట్టు తెలుస్తోంది. ఇక దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ రబడా నాలుగో ఆటగాడిగా వేలంలోకి వచ్చాడు. రబడా కనీస ధర రూ. 2 కోట్లు. గతేడాది వేలంలో ఢిల్లీకి అమ్ముడైన రబడా .. ఈసారి మాత్రం సగానికి పడిపోయాడు. రూ. 9.25 కోట్లతో కమిన్స్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగానే పోటీపడ్డాయి. ముందు నుంచి డుప్లెసిస్ పై మంచి అంచనాలు ఉండడంతో అతనికి మంచి ధర పలికింది. గతేడాది వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన డుప్లెసిస్ కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది. ఇక ఈసారి వేలంలో అతన్ని ఆర్సీబీ రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది. 37 ఏళ్ల డుప్లెసిస్‌ గత సీజన్‌లో 633 పరుగులతో సత్తా చాటి ఓపెనర్‌గా శుభారంభాలు అందించాడు. ఐపీఎల్‌- 2021లో చెన్నై టైటిల్ గెల‌వ‌డంలో డుప్లెసిస్ కీల‌క పాత్ర పోషించాడు. ఇక దక్షిణాఫ్రికా స్టార్‌ పేఓపెనర్ క్వింటన్ డికాక్ ను లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన డికాక్ మంచి వికెట్ కీపర్ కూడా కావడంతో రూ. 6.75 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.