గత బుధవారం చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ (Ravichandran Ashwin) ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని (IPL Code Of Conduct) ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. అంపైర్ నిర్ణయంపై వ్యాఖ్యానించినందుకు అశ్విన్ జరిమానాను ఎదుర్కోవాల్సి వచ్చింది. మ్యాచ్‌లో మంచు కారణంగా బంతిని మార్చాలనే అంపైర్ల నిర్ణయంపై అశ్విన్ వ్యాఖ్యానించాడ. దాని కారణంగా అతనికి ఈ జరిమానా పడింది.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 175/8 పరుగులు చేసింది. చెన్నై జట్టు ఛేజింగ్‌లో విఫలమైంది. ఈ మ్యాచ్ ద్వారా రాజస్థాన్ ఐపీఎల్-16లో మూడో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన రవిచంద్రన్ అశ్విన్ ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించినట్లు ఐపిఎల్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
‘బంతిని మార్చమని అంపైర్‌ని అడగలేదు’
మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో అశ్విన్ మాట్లాడుతూ.. ‘బంతిని మార్చాలన్న అంపైర్ నిబంధన వల్ల మ్యాచ్ ఫలితం మంచిదైనా చెడు కావచ్చు. కాబట్టి సమతూకం పాటించాల్సిన అవసరం ఉంది. మా జట్టు బౌలింగ్ చేస్తోంది, బంతిని మార్చమని మేము అంపైర్‌ని అడగలేదు, కానీ అంపైర్ బంతిని మార్చాడు. దీనికి కారణం ఏమిటని అడగ్గా.. అలా చేసే అధికారం తమకు ఉందని చెప్పారని తెలిపాడు. ఇది తమకు అనుకూలమైన నిర్ణయమే అయినా.. ఇలా చేయడం తనకు నచ్చలేదన్నాడు.
అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు
చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అశ్విన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో అతను బంతితో పాటు బ్యాట్‌తోనూ జట్టుకు తనవంతు సహకారం అందించాడు. ఐదో నంబర్‌లో బ్యాటింగ్ చేసిన అశ్విన్ 22 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత బౌలింగ్‌లో 4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.