Site icon HashtagU Telugu

Ravichandran Ashwin: అశ్విన్ ఖాతాలో మ‌రో అరుదైన రికార్డు

Ashwin Retirement

Ashwin Retirement

Ravichandran Ashwin: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత స్టార్ ఆటగాడు ఆర్ అశ్విన్ (Ravichandran Ashwin) చరిత్ర సృష్టించాడు. కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో వికెట్ తీయడం ద్వారా అశ్విన్ ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టు క్రికెట్‌లో ఆసియాలోనే అత్యధిక వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌పై ఒక వికెట్ తీయడం ద్వారా అతను టీమ్ ఇండియా లెజెండరీ మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే 419 వికెట్ల రికార్డును వెనుకకు నెట్టాడు.

అశ్విన్‌ ఆసియాలో ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో మొత్తం 420 వికెట్లు పడగొట్టాడు. కాగా టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన కెరీర్‌లో 419 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన పరంగా శ్రీలంక గ్రేట్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ నంబర్ వన్. ముత్తయ్య మురళీధరన్ ఆసియా ఖండంలో ఆడిన టెస్టుల్లో అత్యధికంగా 512 వికెట్లు తీసిన ఘనత సాధించాడు.

Also Read: YS Jagan: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది: వైఎస్‌ జగన్‌

అశ్విన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 101 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 522 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్‌లో ఆర్ అశ్విన్ 8 సార్లు ప‌దేసి వికెట్లు, 37 సార్లు ఐదేసి వికెట్లు, 25 సార్లు నాలుగేసి వికెట్లు తీసిన ఘనత సాధించాడు. ఇదే సమయంలో అశ్విన్ వన్డే క్రికెట్‌లో 116 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అశ్విన్ 156 వికెట్లు తీశాడు. వన్డే మ్యాచ్‌లో 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం ఆర్ అశ్విన్ అత్యుత్తమ ప్రదర్శన. ఇది కాకుండా అంతర్జాతీయ టి20 క్రికెట్ గురించి మాట్లాడితే.. అశ్విన్ 65 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను మొత్తం 72 వికెట్లు తీశాడు.

కాన్పూర్ టెస్టు మొద‌టి రోజు ర‌ద్దు

కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు సిరీస్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోవడంతో 9 ఏళ్ల రికార్డు కూడా బద్దలైంది. వాస్తవానికి కాన్పూర్‌లో వర్షం కారణంగా అవుట్‌ఫీల్డ్ తడిగా ఉండ‌టంతో మ్యాచ్‌లో టాస్ ఆలస్యంగా ప‌డ‌టంతో మ్యాచ్ కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట వెలుతురులేమి కారణంగా నిలిచిపోయింది. బంగ్లా స్కోరు 107/3 వద్ద అంపైర్లు ఆటను నిలిపేశారు.

Exit mobile version