500 Wickets : అశ్విన్‌ రికార్డ్.. 500 టెస్ట్‌ వికెట్లు కైవసం

500 Wickets : టెస్టుల్లో అత్యంత అరుదైన 500 వికెట్ల మైలురాయిని టీమిండియా పేసర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తాకాడు. 

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 03:58 PM IST

500 Wickets : టెస్టుల్లో అత్యంత అరుదైన 500 వికెట్ల మైలురాయిని టీమిండియా పేసర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తాకాడు.  గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఈ రికార్డును ఆయన సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే వికెట్‌ తీయడం ద్వారా 500 వికెట్ల క్లబ్‌లోకి అశ్విన్ చేరిపోయాడు. అశ్విన్‌ తన  98వ టెస్ట్‌ మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించడం గమనార్హం. ఓవరాల్‌గా అశ్విన్‌ 500 వికెట్ల ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.  అశ్విన్‌ భారత్‌ తరఫున టెస్ట్‌ల్లో రెండో అత్యధిక వికెట్‌ టేకర్‌గా ఉన్నాడు. అశ్విన్‌కు ముందు అనిల్‌ కుంబ్లే (619 వికెట్లు) 500 వికెట్ల మార్కును తాకాడు. ఇంగ్లాండ్​ ఇన్నింగ్స్​కు ముందు అశ్విన్ ఎవరిని ఔట్ చేసి 500 మైలురాయి(500 Wickets) అందుకుంటాడని బీసీసీఐ ఓ స్పెషల్ వీడియో చేసింది. అందులో దినేశ్ కార్తిక్, పార్థీవ్ పటేల్ సహా తదితరులు బెన్ డకెట్, జో రూట్, స్టోక్స్ పేర్లు చెప్పగా సునీల్ గావస్కర్ మాత్రం కరెక్ట్​గా అంచనా వేశాడు. అతడు జాక్ క్రాలీని ఔట్ చేసిన ఈ ఘనత అందుకుంటాడని ముందుగానే గెస్ చేశాడు.

500 వికెట్ల క్లబ్‌లో వీరే.. 

టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్ల రికార్డు లంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ (800) పేరిట ఉంది. ఈ జాబితాలో షేన్‌ వార్న్‌ (708), జేమ్స్‌ ఆండర్సన్‌ (696), అనిల్‌ కుంబ్లే (619), స్టువర్ట్‌ బ్రాడ్‌ (604), మెక్‌గ్రాత్‌(563), వాల్ష్‌ (519), నాథన్‌ లయోన్‌(517) ఉన్నారు. టెస్ట్‌ల్లో అశ్విన్‌ అత్యుత్తమ గణాంకాలు 7/59 (ఇన్నింగ్స్‌), 13/140గా (మ్యాచ్‌) ఉన్నాయి.బంతుల పరంగా అత్యంత వేగంగా (25714) 500 వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ జాబితాలో మెక్‌గ్రాత్‌ (25528) అశ్విన్‌ కంటే ముందున్నాడు. మ్యాచ్‌ల పరంగా అత్యంత వేగంగా (98) 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో మురళీధరన్‌ (87 టెస్ట్‌లు) టాప్‌లో ఉన్నాడు.

We’re now on WhatsApp. Click to Join

తక్కువ టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్లు

  • ముత్తయ్య మరళీధరణ్ (శ్రీలంక)- 87 టెస్టులు
  • రవిచంద్రన్ అశ్విన్ (భారత్)- 98 టెస్టులు
  • అనిల్ కుంబ్లే (భారత్)- 105 టెస్టులు
  • షేన్ వార్న్ (ఆస్ట్రేలియా)- 108 టెస్టులు
  • మెక్ గ్రాత్ (ఆస్ట్రేలియా)- 110 టెస్టులు

Also Read : Big Shock : అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఆర్డర్లు చేస్తున్నారా ? ‘రీప్లేస్‌మెంట్’ ఇక టఫ్ గురూ

తక్కువ బంతుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్లు

  • మెక్ గ్రాత్ (ఆస్ట్రేలియా)- 25528 బంతులు
  • రవిచంద్రన్ అశ్విన్ (భారత్)- 25714 బంతులు
  • జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్)- 28150 బంతులు
  • స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్)- 28430 బంతులు
  • కోర్ట్నీ వాల్ష్ (జమైకా)- 28833 బంతులు

Also Read : Anti Satellite Weapon : శాటిలైట్లపైకి రష్యా మిస్సైల్స్.. అమెరికా సంచలన ప్రకటన