Site icon HashtagU Telugu

Ravi Shastri: ఫాలో-ఆన్‌ని సమర్ధించిన శాస్త్రి

Ravi Shastri

Ravi Shastri

Ravi Shastri: బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. డిసెంబర్ 26 నుంచి నాలుగో టెస్ట్ మొదలు కానుంది. ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ ను దక్కించుకుంటుంది. పైగా ఈ సిరీస్ ఇరు జట్లకు కాలకంగా మారింది. ఈ సిరీస్ ను కోల్పోతే టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ ఆడే అవకాశం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా నాలుగో టెస్ట్ ఎలాగైనా గెలవాల్సిన అవసరముంది.

ఒకప్పుడు సిరీస్ లు గెలిచి సంబరాలు చేసుకున్న భారత్ ఇప్పుడు కేవలం ఫాలో-ఆన్‌ను తప్పించుకుని సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం కారణంగా టీమిండియా ఫాలో-ఆన్‌ నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. దీనిపై టీమిండియాపై విమర్శలు వచ్చినప్పటికీ కొందరు సీనియర్లు దానిని సమర్థిస్తున్నారు. ఫాలో-ఆన్‌ను తప్పించుకుని సంబరాలు చేసుకోవడం సరైనదేనని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) అభిప్రాయపడ్డాడు. 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో లార్డ్స్‌లో బుమ్రా, మహ్మద్ షమీ మధ్య 89 పరుగుల భాగస్వామ్యాన్ని శాస్త్రి గుర్తుచేసుకున్నాడు, ఈ మ్యాచ్‌లో టీమిండియా చివరి వరకు పోరాడింది.

Also Read: Job Cuts In Google: మ‌రోసారి ఉద్యోగుల‌ను తొల‌గించనున్న గూగుల్‌.. ఈసారి వారి వంతు!

క్లిష్ట పరిస్థితుల నుంచి భారత్‌ను గట్టెక్కించేందుకు లోయర్‌ ఆర్డర్‌ ప్రాముఖ్యతను కూడా ఆయన ఎత్తిచూపారు. ఆ సిరీస్ లో చివరి రోజు టెస్ట్ ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉంది. అయితే టీమిండియా ఒక్కసారిగా ఆటను తిప్పేసిందని శాస్త్రి గుర్తు చేసుకున్నాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు టెయిల్ ఎండర్లు పోరాడుతారని ఆయన చెప్పారు. గత పర్యటనలో అదే జరిగింది. గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్ లో అశ్విన్ ,హనుమ విహారి మ్యాచ్‌ను కాపాడిన రోజుల్ని ఆయన గుర్తు చేసుకున్నాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడు మ్యాచ్‌ల తర్వాత సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు అందరి దృష్టి డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్‌లో ప్రారంభం కానున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌పై పడింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ముందంజ వేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. దీని తర్వాత 2026 జనవరి 3 నుంచి న్యూ ఇయర్ టెస్ట్ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది.