Ravi Shastri: బూమ్రా బ్యాటింగ్‌కు దిగ్గజాలు ఫిదా

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో రెండు సెంచరీలు నమోదైనప్పటకీ... అందరినీ ఆకట్టుకున్న బ్యాటింగ్ మాత్రం బూమ్రాదే.

  • Written By:
  • Publish Date - July 3, 2022 / 02:47 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో రెండు సెంచరీలు నమోదైనప్పటకీ… అందరినీ ఆకట్టుకున్న బ్యాటింగ్ మాత్రం బూమ్రాదే. చివర్లో వచ్చిన తాత్కాలిక కెప్టెన్ బూమ్రా అనూహ్యంగా బ్యాట్ తో విరుచుకుపడ్డాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 29 రన్స్ చేసిన బూమ్రా మొత్తం 35 పరుగులు రాబట్టాడు. బూమ్రా బ్యాటింగ్‌ చూసిన ఇంగ్లాండ్ ఆటగాళ్ళు, డ్రెస్సింగ్‌ రూమ్‌లో భారత ఆటగాళ్ళు షాక్‌కు గురయ్యారు.

ఇక మాజీ క్రికెటర్లు చాలా మంది బూమ్రా బ్యాటింగ్‌ను ఆశ్చర్యానికి లోనయ్యారు. తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఈ విధ్వంసంపై స్పందించాడు. బూమ్రా బ్యాటింగ్‌ను ఎవరూ ఊహించి ఉండరని అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రి మాట్లాడిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది.
యువరాజ్ సింగ్ , తానూ ఒకే ఓవర్లో 36 పన్స్ చేయడం పక్కనపెడితే తాజాగా చూసింది అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయంగా రవిశాస్త్రి అభివర్ణించాడు. క్రికెట్‌లో అన్నీ చూసేసాం అనుకున్న వారిని ఉద్ధేశించి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చూశాడు. అలాంటి వారు ఇంకా విద్యార్థులేనని వ్యాఖ్యానించాడు.

ఎందుకంటే మీరు చూడాల్సింది చాలా ఉందని గుర్తు పెట్టుకోవాలన్నాడు. బూమ్రా పదో స్థానంలో వచ్చి ఒకే ఓవర్లో , అది కూడా టెస్ట్ క్రికెట్‌లో ఇలాంటి బ్యాటింగ్ చేయడం గొప్ప విషయమన్నాడు. కాగా గతంలో బ్రియాన్ లారా, బెయిలీ, కేశవ్ మహరాజ్ ఒకే ఓవర్లో 28 పరుగులు చేయగా… ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో బూమ్రా ఆ రికార్డును అధిగమించాడు. బూమ్రా విధ్వంసకర ఇన్నింగ్స్‌పై మాజీ క్రికెటర్లు సచిన్,రవిశాస్త్రి, ఆకాశ్ చోప్రా వంటి వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.