Ball Tampering: 1983లో పాకిస్థాన్ బాల్ టాంపరింగ్ ని గుర్తు చేసుకున్న శాస్త్రి

భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి 1983లో పాకిస్థాన్ తో జరిగిన టెస్టులో తన మొదటి టెస్టు సెంచరీ సాధించాడు. కరాచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రవి శాస్త్రి 128 పరుగులు చేశాడు.

Ball Tampering: భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి 1983లో పాకిస్థాన్ తో జరిగిన టెస్టులో తన మొదటి టెస్టు సెంచరీ సాధించాడు. కరాచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రవి శాస్త్రి 128 పరుగులు చేశాడు. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో ఆ మ్యాచ్ లో తాను ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేస్తున్నాడు శాస్త్రి.

ఆదివారం ఓవల్‌లో జరిగిన ఐసిసి ఈవెంట్‌లో పాక్ బౌలర్ వసీం అక్రమ్,ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌, రవిశాస్త్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా హర్షా భోగ్లే వ్యహరించారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో భోగ్లే శాస్త్రిని పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. మీకు ఏ ఇన్నింగ్స్ ఎక్కువ నచ్చిందని అడగగా..లాహోర్‌లో నేను పాకిస్తాన్‌తో ఆడిన టెస్ట్ గురించి చెప్పాడు. ఆ ఇన్నింగ్స్ లో పాక్ కు వ్యతిరేకంగా తొలి సెంచరీ సాధించినట్టు తెలిపాడు.

ఈ సందర్భంగా బాల్ టెంపరింగ్ గురించి భోగ్లే శాస్త్రిని అడిగాడు. పాకిస్థాన్‌పై నా తొలి టెస్టు సెంచరీ చేసినప్పుడు అక్కడ చాలా విచిత్రాలు జరిగాయని, ఆ ఇన్నింగ్స్ లో పాక్ బౌలర్లు అనేక విధాలుగా బాల్ టాంపరింగ్ కు పాల్పడినట్టు శాస్త్రి గుర్తు చేసుకున్నాడు. గోళ్లతో,బాటిల్ మూతలతో బంతిని గాయపరచడాన్ని నేను చూశానని చెప్పాడు. అప్పుడు ఇమ్రాన్ ఖాన్, సర్ఫరాజ్ నవాజ్‌లతో పాటు ఇద్దరు అంపైర్లు కూడా ఉన్నట్టు శాస్త్రి గుర్తు చేసుకున్నాడు.

కాగా ప్రస్తుతం భారత్ WTC ఫైనల్‌ పర్యటనలో ఉంది. ఇప్పటికే ఆటగాళ్లు ఇంగ్లాండ్ చేరుకున్నారు. అయితే ఈ సిరీస్ లో ఆస్ట్రేలియన్ బౌలింగ్ ఎటాక్‌ను హైలెట్ చేశారు శాస్త్రి. భారత్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా ఉంటే, రెండు జట్ల బౌలింగ్ అటాక్ ఒకేలా ఉండేదని, అయితే ఆస్ట్రేలియాలో పాట్ కమిన్స్ మరియు మిచెల్ స్టార్క్ ఉన్నారని చెప్పాడు. ప్రస్తుతం రెండు జట్లూ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉన్నాయని శాస్త్రి చెప్పాడు.

Read More: మెట్లుఎక్కి నెటిజెన్స్ ని ఆశ్చర్యపరిచిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వీడియో వైరల్?