SL vs IND 1st T20I: రక్తం కారుతున్నా పట్టించుకోని రవి బిష్ణోయ్

రవి బిష్ణోయ్ గాయపడ్డాడు. 16వ ఓవర్ తొలి బంతికి కమిందు మెండిస్ ముందు వైపు షాట్ కొట్టాడు. ఫాలో త్రూలో రవి బిష్ణోయ్ ఒంటి చేత్తో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాడు. అయితే రవి బిష్ణోయ్ పేస్ బలంగా మైదానానికి తాకడంతో ఎడమ కంటికి కింద భాగాన తీవ్ర గాయమైంది.

Published By: HashtagU Telugu Desk
SL vs IND 1st T20I

SL vs IND 1st T20I

SL vs IND 1st T20I: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు, శ్రీలంక క్రికెట్ జట్టు మధ్య శనివారం పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంకకు శుభారంభం లభించింది. ఆ తర్వాత బౌలర్లు భారత జట్టుకు పునరాగమనం చేశారు. ఇంతలో రవి బిష్ణోయ్ గాయపడ్డాడు. అయినా పట్టు వదలలేదు. బ్యాండేజీ కట్టుకుని మైదానంలోకి వచ్చి వికెట్ తీశాడు.

ఒంటి చేత్తో క్యాచ్ ప్రయత్నం:
16వ ఓవర్ తొలి బంతికి కమిందు మెండిస్ ముందు వైపు షాట్ కొట్టాడు. ఫాలో త్రూలో రవి బిష్ణోయ్ ఒంటి చేత్తో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో అతను నేలపై పడిపోయాడు. అయితే చేతిలో ఉన్న బంతి అతను మొహానికి బలంగా తాకింది. దీంతో ఎడమ కంటికి కింద భాగాన తీవ్ర గాయమైంది. రక్తం కూడా కారింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఫిజియో రవి బిష్ణోయ్‌కు కట్టు కట్టారు. గాయపడినప్పటికీ, బిష్ణోయ్ తన ఓవర్ పూర్తి చేశాడు.

కెప్టెన్ అస్లాంక వికెట్ తీశాడు:
రవి బిష్ణోయ్ ఆ ఓవర్ చివరి బంతికి శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంకను బలిపశువును చేశాడు. అసలంక 2 బంతులు ఎదుర్కొని ఖాతా కూడా తెరవలేకపోయాడు. మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ ప్రదర్శన గురించి చెప్పాలంటే అతను 4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 9.2 ఎకానమీతో 37 పరుగులకు 1 వికెట్ తీసుకున్నాడు.

Also Read: IND vs SL 1st T20I: బోణీ అదిరింది లంకపై తొలి టీ ట్వంటీ మనదే

  Last Updated: 27 Jul 2024, 11:31 PM IST