IPL 2024: ఐపీఎల్ కు ముందు రషీద్ ఖాన్ విధ్వంసం

ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 4 భారీ వికెట్లు పడగొట్టాడు.

IPL 2024: మరో నాలుగు రోజులో ఐపీఎల్ ప్రారంభం కానుంది. డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మర్చి 22న తలపడతాయి. ఇందుకోసం ఇరు జట్లు సన్నద్ధం అవుతున్నాయి. మిగతా విదేశీ ప్లేయర్లు కొందరు ఇప్పటికే ఇండియా చేరుకున్నారు. కాగా ఐపీఎల్ కు ముందు రషీద్ ఖాన్ విధ్వంసం సృష్టించాడు. తన పదునైన బంతులు సంధించి నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టి ప్ప్రత్యర్ది జట్టు ఐర్లాండ్ కు వణుకు పుట్టించాడు.

ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 4 భారీ వికెట్లు పడగొట్టాడు. హ్యాట్రిక్‌ మిస్సయినా.. అద్భుత ప్రదర్శనతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. రషీద్ బ్యాటింగ్‌ పరంగా సత్తా చాటాడు. ఇన్నింగ్స్ లో రషీద్ ఖాన్ 26 పరుగులు చేశాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. సమాధానంగా ఐర్లాండ్ జట్టు 142 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ ఆనందం వ్యక్తం చేస్తుంది. కెప్టెన్ హార్దిక్ జట్టును వీడటంతో జట్టు పట్టు బలహీన పడినట్లయింది. పైగా సీనియారిటీ లేని గిల్ కెప్టెన్ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ నెప్పధ్యంలో రషీద్ గుజరాత్ కు కొండంత బలాన్ని ఇచ్చాడు.

2017లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన రషీద్ ఖాన్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 109 మ్యాచ్‌లు ఆడాడు , అందులో అతను బ్యాట్‌తో 443 పరుగులు చేశాడు, బౌలింగ్‌లో 139 వికెట్లు తీసుకున్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో రషీద్ ఖాన్ 17 మ్యాచ్‌ల్లో మొత్తం 27 వికెట్లు పడగొట్టాడు.

Also Read: Danam Nagender : దానం నాగేందర్ పై స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు